Rakul Preet Singh నివసించే బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-11-21T01:21:11+05:30 IST

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను నటిస్తూ బిజీగా ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ముంబైలో ఆమె నివసించే బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది

Rakul Preet Singh నివసించే బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోను నటిస్తూ బిజీగా ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ముంబైలో ఆమె నివసించే బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆమె నివసించే 12వ అంతస్తులో మంటలు చేలరేగాయి. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి.  ఈ ఘటనలో రకుల్ ఇంటికి ఎటువంటి నష్టం జరగలేదని స్థానిక మీడియా తెలుపుతోంది. తన అపార్ట్‌మెంట్‌లో జరిగిన ప్రమాదంపై రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు.


బాలీవుడ్‌లో రకుల్ దే దే ప్యార్ దే, మర్జావాన్, సిమ్లా మిర్చి, సర్దార్ కా గ్రాండ్ సన్ వంటి తదితర చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన అటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండ్రెల్లా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ‌ని ప్రేమిస్తున్నట్టు తన పుట్టినరోజున ఆమె అధికారికంగా ప్రకటించింది. అతడు తనకు దక్కిన గొప్ప బహుమతిగా  ఆమె అభివర్ణించింది.  

Updated Date - 2021-11-21T01:21:11+05:30 IST