Makers suggestion to Ktr: ఇవి చూడండి.. చూస్తూనే ఉండిపోతారు

ABN , First Publish Date - 2022-07-25T01:00:10+05:30 IST

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కాలికి గాయమై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే! ఆదివారం ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపించారు అభిమానులు. ‘కాలికి గాయమై మూడు వారాలు రెస్ట్‌ తీసుకోవలసి వచ్చింది.

Makers suggestion to Ktr: ఇవి చూడండి.. చూస్తూనే ఉండిపోతారు

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ (Ktr)కాలికి గాయమై ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే! ఆదివారం ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపించారు అభిమానులు. ‘కాలికి గాయమై మూడు వారాలు రెస్ట్‌ తీసుకోవలసి వచ్చింది. ఓటీటీలో అలరించే సినిమాలు , సిరీస్‌లను సజెస్ట్‌ చేయండి’ అని ఆయన ట్విట్టర్‌ వేదికగా కోరారు. దీంతో కొందరు ఫిల్మ్‌ మేకర్లు, నెటిజన్లు, అనేక సినిమాలు సిరీస్‌లను చూడమని సూచించారు. (Makers suggestion to Ktr)

‘ఆహా’ ఓటీటీ కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి, త్వరగా కోలుకోవాలంటే ‘డీజే టిల్లు’ చూడాలని డాక్టర్లు సూచించినట్లు ట్వీట్‌ చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ఎన్‌బీకే అన్‌స్ట్టాపబుల్‌’, ప్రియమణి ‘భామాకలాపం’ అమలాపాల్‌ ‘కుడి ఎడమైతే’ సిరీస్‌లు మిస్‌ కావొద్దని పోస్ట్‌ చేశారు. 

ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘గాడ్సే’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించమని దర్శకుడు గోపీ గణేశ్‌ పట్టాభి (Director Gopi ganesh)కేటీఆర్‌కు సూచించారు. ‘‘యువత కోసం తీసిన సినిమా ఇది. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను, మీ రివ్యూ కోసం ఎదురుచూస్తున్నా సర్‌’’ అని గోపీ గణేశ్‌ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 



జీ5 ఓటీటీ కూడా కేటీఆర్‌కు పలు సినిమాలు, సిరీస్‌లను సూచించింది. ‘‘కేటీఆర్‌ గారూ ‘మా నీళ్ల ట్యాంకు’(Maa neella tank)తో స్టార్‌ చేసి, ‘రెక్కీ’తో థ్రిల్‌ అవుతూ, మధ్యాహ్నం భోజనం సమయానికి కుటుంబమంతా కలిసి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చూసి, నైట్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చూడండి. త్వరగా కోలుకుంటారు. కానీ, ఒక్క విషయం జాగ్రత్త.. ‘చూస్తూనే ఉండిపోతారు’’ అంటూ జీ5 ట్వీట్‌ చేసింది. ‘పరంపర2’ సిరీస్‌ చూడమని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సూచించింది.


నెటిజన్లు కూడా కేటీఆర్‌కు కొన్ని సినిమాలను సూచించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ‘మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌’ వీక్షించమని ఓ నెటిజన్‌ సూచించారు.  ‘పంచాయత్‌’,  మౌస్‌, డార్క్‌, గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, మనీ హైస్ట్‌, వర్జిన్‌ రివర్‌, రాకెట్‌ బాయ్స్‌ సిరీస్‌లు, సినిమాలు చూడమని సూచించారు. 





Updated Date - 2022-07-25T01:00:10+05:30 IST