Brahmastra: కరణ్ జోహార్ సినిమా కోసం రాజమౌళికి రూ.10కోట్లు చెల్లించారా..!

ABN , First Publish Date - 2022-09-14T20:41:18+05:30 IST

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). సెలబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia

Brahmastra: కరణ్ జోహార్ సినిమా కోసం రాజమౌళికి  రూ.10కోట్లు చెల్లించారా..!

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ (Karan Johar) నిర్మించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ (Brahmastra Part One: Shiva). సెలబ్రిటీ కపుల్  రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) హీరో, హీరోయిన్‌లుగా నటించారు. అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించాడు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌‌స్టార్ స్టూడియోస్‌, ప్రైమ్ ఫోకస్ వంటి సంస్థలు కలసి నిర్మించాయి. ఈ మూవీ పాన్ ఇండియాగా రూపొందింది. బీ టౌన్ హిస్టరీలోనే అత్యధికంగా రూ.410కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. ‘బ్రహ్మాస్త్ర’ ను దక్షిణాది భాషల్లో యస్‌యస్. రాజమౌళి (SS.Rajamouli) సమర్పించాడు. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ప్రమోషన్స్ చేశాడు. ఈ చిత్రానికి సహాయం చేసినందుకు జక్కన్నకు కరణ్ జోహార్ రూ. 10కోట్లు చెల్లించడాని పుకార్లు షికార్లు కొట్టాయి. ఆ వదంతులపై ధర్మ ప్రొడక్షన్స్‌తో సన్నిహితంగా మెలిగే కొంత మంది స్పందించారు. 


ధర్మ ప్రొడక్షన్స్‌తో సన్నిహితంగా మెలిగేవారు ఆ పుకార్లన్నింటిని కొట్టి పారేసారు. అత్యుత్సాహంతో మీడియా రాస్తున్న వార్తలన్ని చెప్పారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ (Baahubali)‌ ని కరణ్ హిందీ మార్కెట్‌లో డిస్ట్రిబ్యూట్ చేశారు. అందువల్లే ‘బ్రహ్మాస్త్ర’ కు సహాయం చేసేందుకు జక్కన్న అంగీకరించాడని తెలిపారు. రాజమౌళి, కరణ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకే ఇటువంటి వార్తలు వస్తున్నాయని ధర్మ ప్రొడక్షన్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్‌లోను రాజమౌళి ఇదే విషయాన్ని చెప్పాడు. ‘‘కరణ్ తీసే సినిమాలకు నేను తీసే చిత్రాలకు అస్సలు పోలిక ఉండదు.  బాహుబలికి కరణ్ ఎంతగానో సహాయం చేశాడు. అందువల్లే బ్రహ్మాస్త్ర సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడానికి అంగీకరించాను. అనంతరం అయాన్ ముఖర్జీ వచ్చి నాకు కథ చెప్పాడు’’ అని రాజమౌళి పేర్కొన్నాడు. ఈ మధ్యనే థియేటర్స్‌లోకి వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికి బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబడుతుంది. భారత్‌లో అన్ని వెర్షన్స్ కలుపుకొని ఐదు రోజులకు గాను రూ. 150కోట్ల నెట్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టడం చెప్పుకోదగ్గ విశేషం. 

Updated Date - 2022-09-14T20:41:18+05:30 IST