టాలీవుడ్‌: ఏపీ ప్రభుత్వాని కృతజ్ఞతలు.. కమిటీ సమావేశానికి ఆదేశం

ABN , First Publish Date - 2021-12-30T22:13:34+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న థియేట్లను ఇటీవల అధికారులు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే! అయితే ఆ థియేటర్లను తెరచుకోవడానికి, లైసెన్స్‌లను పునరుద్ధరించుటకు ప్రభుత్వం నెల రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

టాలీవుడ్‌: ఏపీ ప్రభుత్వాని కృతజ్ఞతలు.. కమిటీ సమావేశానికి ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న థియేట్లను ఇటీవల అధికారులు సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే! అయితే ఆ థియేటర్లను తెరచుకోవడానికి, లైసెన్స్‌లను పునరుద్ధరించుటకు ప్రభుత్వం నెల రోజులు గడువు ఇచ్చింది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని, ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజిత్‌. ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ టి. విజయ్‌ చందర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.వి.కె రెడ్డి ఇలా పరిశ్రమలో అనుబంధం ఉన్న మంత్రులకు, ఎం.ఎల్‌.ఎలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. టికెట్‌ రేట్లు, ఇతర సమస్యలను కూడా త్వరలో పరిష్కరించాలని కోరారు. 


అలాగే సినిమా టికెట్‌ ధరలు నిర్ణయించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానుంది. టికెట్ల ధరల నిర్థారణ, థియేటర్ల వర్గీకరణ అంశాలపై హోమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌ నేతృత్వంలో 13 మందితో కమిటీని సర్కారు నియమించిన విషయం తెలిసిందే. ఎగ్జిబిటర్లు, డిస్ర్టిబ్యూటర్లు,  బయ్యర్లు, నిర్మాతలు పెట్టిన విజ్ఞప్తులను కమిటీ పరిశీలించనుంది.


Updated Date - 2021-12-30T22:13:34+05:30 IST