Film stars Rakhi spl: అను‘బంధాల’ రక్షారేఖ!

ABN , First Publish Date - 2022-08-07T23:39:48+05:30 IST

అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతం... తోబుట్టువులే ఒకరికొకరు రక్షాబంధనం... సోదరి చేతికి రాఖీ కట్టి, నుదుట విజయ తిలకం దిద్ది, హారతి ఇచ్చి, నోటిని తీపి చేస్తే... సోదరుడు నిండు హృదయంతో ప్రేమకానుక ఇస్తాడు. ఇది ప్రతీ ఇంట్లో కనిపించే ఒక అద్భుత దృశ్యం. రాఖీ పండగ (ఆగస్టు 11న) సందర్భంగా కొందరు సెలబ్రిటీల సందడి ఇది.

Film stars Rakhi spl: అను‘బంధాల’ రక్షారేఖ!

అన్నాచెల్లెళ్ల అనురాగానికి సంకేతం... (Raksha Bandhan)

తోబుట్టువులే ఒకరికొకరు రక్షాబంధనం...

సోదరి చేతికి రాఖీ కట్టి, నుదుట విజయ తిలకం దిద్ది, హారతి ఇచ్చి, నోటిని తీపి చేస్తే... సోదరుడు నిండు హృదయంతో ప్రేమకానుక ఇస్తాడు. ఇది ప్రతీ ఇంట్లో కనిపించే ఒక అద్భుత దృశ్యం. రాఖీ పండగ (ఆగస్టు 11న) సందర్భంగా కొందరు సెలబ్రిటీల సందడి ఇది. (Film celebritis Rakhi  festival)


వాడే నా రక్షణ కవచం...

‘‘అమన్‌ నాకన్నా మూడేళ్లు చిన్న. వెరీ వెరీ నాటీ బాయ్‌. జంగిల్‌బుక్‌లో మోగ్లీలా..! కొన్నేళ్ల క్రితం వరకు మేమిద్దరం బాగా కొట్టుకునే వాళ్లం. నన్ను చాలా ఇరిటేట్‌ చేసేవాడు. అయితే ప్రతి ఏటా రాఖీ కట్టడం మాత్రం మరువను. వాడిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇంతకుముందు రాఖీ కట్టిన తరువాత గిఫ్ట్స్‌ ఇచ్చేవాడు. ఇప్పుడు నేనే వాడికి గిఫ్ట్స్‌ ఇస్తున్నాను. నేను హైదరాబాద్‌లో ఉంటే నా బాడీగార్డ్‌ అమనే. పబ్లిక్‌లోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు, క్రౌడ్‌ని క్లియర్‌ చేసి నాకు రక్షణగా నిలుస్తాడు. తను నాకన్నా పెద్ద స్టార్‌. తను గోల్ఫ్‌ నేషనల్‌ ప్లేయర్‌ ’’ అంటూ తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు రకుల్‌.




రాఖీ కట్టడం మరవను(kangana ranauth)

‘‘అక్షిత్‌ నాకు సోదరుడైనందుకు చాలా గర్వపడతాను. నా బలం, నా ధైర్యం తనే. సోదరుడు బాగుండాలని కోరుకుంటూ రక్ష కట్టే రాఖీ పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు ఏ షెడ్యూల్‌ ఉన్నా అక్షిత్‌కు రాఖీ కట్టడం మాత్రం మరువను’’ అని సోదరుడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తారు కంగనా రనౌత్‌. రాఖీ పండుగ రోజున సోదరుడితో తనకున్న బాల్యస్మృతులను ఆమె ట్విట్టర్‌లో పంచుకుంటారు. ‘‘చిన్నప్పుడు మనిద్దరి కోసం డాడీ ప్లాస్టిక్‌ గన్‌లు, సైకిళ్లు కొనేవారు. కానీ నేను నీ గన్స్‌తో, సైకిల్‌తో ఆడుకునేదాన్ని. చాలా సందర్భాల్లో నువ్వు నాకు అండగా నిలబడ్డావు. నీలాంటి సోదరుడు నాకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది.’’ 




అమ్మ కన్నా అక్కంటేనే భయం(Vishwaksen)

బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే విశ్వక్‌సేన్‌ రక్షాబంధన్‌ రోజున అక్క వాన్మయితో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ‘‘ఇంటర్‌ వరకు అక్కా నేను జుట్టు పట్టి కొట్టేసుకునేవాళ్లం. నువ్వు నా అక్కవు కాదు అని నేనంటే, నువ్వు నా తమ్ముడివి కాదు అని తను అనేది. ఆ రోజులను తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంటుంది. అవన్నీ స్వీట్‌ మెమొరీస్‌. నాకు మమ్మీ కంటే అక్క అంటేనే ఎక్కువ భయం. ఏదైనా కావాలంటే నేను ఫైట్‌ చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ అక్క మాత్రం ఓవర్‌నైట్‌ తెచ్చుకుంటుంది. తనకి స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం. నేను స్వీట్స్‌ను అసలు ముట్టను. రక్షాబంధన్‌ రోజున ఇంట్లోనే ఉండేలా చూసుకుంటాను. అక్క చేత్తో రాఖీ కట్టించుకున్నాకే మిగతా పనులు’’ అని అంటారు విశ్వక్‌సేన్‌. వాన్మయి కూడా తమ్ముడి గురించి గొప్పగా చెబుతుంది. చిన్నప్పుడు కొట్టుకున్నా ఇప్పుడు వాడంటే చాలా ఇష్టం అని అంటుంది. లోపల ఒకరకంగా, బయట ఒకరకంగా ఉండడు. చాలా ప్రేమగా ఉంటాడు. మొహమాటం ఎక్కువ అని తమ్ముడి గురించి చెబుతారు వాన్మయి.




విడదీయరాని బంధం..(Anushka sharma)

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా రక్షాబంధన్‌ రోజున సోదరుడు కర్నేష్‌ను తప్పక కలుస్తారు అనుష్క. సోదరుడితో కలిసి ప్రొడక్షన్‌ కంపెనీ ప్రారంభించారు అనుష్క. అందరి ఇళ్లలో మాదిరిగానే మా ఇంట్లోనూ టీవీ రిమోట్‌ కోసం గొడవపడేవారమని అంటారామె. పెద్దయ్యాక వాళ్లిద్దరూ కలిసి ‘ఎన్‌హెచ్‌10’ సినిమాను నిర్మించారు. ‘‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌, మై యాంకర్‌... టీవీ రిమోట్‌ కోసం కొట్టుకోవడం దగ్గరి నుంచి సినిమాలు నిర్మించే వరకు చాలా దూరం కలిసి ప్రయాణించాం. ఎప్పటికీ నీతో బంధం ఇలాగే నిలిచి ఉంటుంది’’ అని సోదరుడిపై ప్రేమను పంచుకుంటారు అనుష్క. భర్త విరాట్‌ కోహ్లీ, కూతురు వామిక బాగోగులు చూసుకుంటూ బిజీగా ఉన్నా రాఖీ పండుగ రోజున మాత్రం కర్నేష్‌కు రాఖీ కట్టడం మాత్రం మరువదు.



సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇస్తాడు(Hritik roshan)

‘‘హృతిక్‌ చిన్నప్పుడు చాలా సిగ్గరి. అయితే పట్టుదల ఎక్కువ. నా ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి చాలా సిగ్గుపడేవాడు. పదమూడేళ్ల వయసులో అనుకుంటా. నాకు బాగా గుర్తు. కూర్చుని ఏకబిగిన గంటల కొద్దీ గట్టిగా చదివేవాడు. తనకున్న నత్తి సమస్యను పోగొట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. వాయిస్‌ రికార్డు చేసుకుని మళ్లీ మళ్లీ ప్రాక్టీస్‌ చేసేవాడు’’ అని బాల్యస్మృతులను పంచుకుంటారు సునైనా రోషన్‌. హృతిక్‌ కన్నా రెండేళ్లు పెద్దదైన సునైన రక్షాబంధన్‌ రోజున తమ్ముడికి రాఖీ కట్టి ‘యే బంధన్‌ తో ప్యార్‌ కా బంధన్‌ హై’ అని తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని వ్యక్తపరుస్తారు. ‘‘రక్షాబంధన్‌ రోజున ఎక్కువ సమయం తమ్ముడితోనే ఉంటా. హృతిక్‌ నాకు ఇచ్చే రాఖీ గిఫ్ట్‌ కూడా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ప్రపంచంలో ఏ సోదరుడు చేయలేనంతగా తను నాకోసం చేశాడు. సోదరుని కంటే ఎక్కువగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు’’ అంటారు సునైనా రోషన్‌.


Updated Date - 2022-08-07T23:39:48+05:30 IST