Film celebs: త్యాగధనులకు ఒక్కక్షణం కేటాయిద్దాం!

ABN , First Publish Date - 2022-08-15T20:38:46+05:30 IST

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని కొనియాడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుంటున్నారు.

Film celebs: త్యాగధనులకు ఒక్కక్షణం కేటాయిద్దాం!

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రమని కొనియాడుతున్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం ఆంగ్లేయులపై అలుపెరగని పోరాటం చేసి  ప్రాణాలు అర్పించిన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుంటున్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (75th independence Day) పురస్కరించుకుని సినీతారలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు(Film celebrities). చిరంజీవి(Chiranjeevi), పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), మహేశ్‌(mahesh), అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ఎస్‌.జె. సూర్య, తాప్సి, కల్యాణ్‌ రామ్‌(kalyan ram), ప్రభాస్‌, సమంత, రకుల్‌(Rakul),  ఐశ్వర్యా రాజేశ్‌,  అల్లు అరవింద్‌, శిరీశ్‌ ఇలా సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్‌ మీడియా వేదికగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులుగా జన్మించినందుకు గర్వంగా ఉందని తెలిపారు. 


‘‘యావన్మంది భారతీయు?కు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు గర్వంగా రెప రెప లాడుతున్న మన త్రివర్ణ జాతీయ పతాకం’’ అంటూ చిరంజీవి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 


ఒకే దేశం.. ఒకే భావోద్వేగం.. ఒకే గుర్తింపు.. 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటూ మహేశ్‌బాబు తన కూతురితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. 


స్వేచ్ఛ అనే ప్రతిఫలాన్ని భావితరాలకు అందజేయడానికి, మన కోసం అలుపెరగని పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన అమరవీరులు అందరిని స్మరించుకుందాం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

– రామ్‌చరణ్‌ 


‘‘ప్రతి ఒక్కరికీ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జైహింద్‌’’ 

– ఎన్టీఆర్‌


‘‘రియల్‌ హీరోలందరినీ స్మరించుకోవడానికి ఒక్క నిమిషం కేటాయిద్దాం. మన భవిష్యత్తును మరింత సుసంపన్నంగా మార్చుకోవడానికి కృషి చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తోటి భారతీయులు అందరికీ శుభాకాంక్షలు’’ 

– నందమూరి కల్యాణ్‌రామ్‌


‘‘మన జెండా మన గౌరవం.. భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’’ 

– మంచు లక్ష్మి


మహాత్ముని నేతృత్వంలో ఎందరో మహానుభావుల త్యాగ ఫలం. మూలంగా నేడు మనం ేస్వచ్ఛా వాయువులను పీలుస్తున్నాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులకు శిరసువంచి నమస్కరిస్తూ.. జై హింద్‌’’ 

– పరుచూరి గోపాలకృష్ణ


‘‘మన దేశం కోసం నిస్వార్థంగా తమ ప్రాణాలను అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం!! ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’

 – ఐశ్వర్యా రాజేశ్‌
































Updated Date - 2022-08-15T20:38:46+05:30 IST