దాసరి జయంతి స్పెషల్‪గా Pan India దర్శకులకు సత్కారం

ABN , First Publish Date - 2022-05-06T01:07:01+05:30 IST

దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) జయంతి (మే 4) సందర్భంగా.. దాసరి కల్చరల్ ఫౌండేషన్ (Dasari Cultural Foundation) ఆధ్వర్యంలో తెలుగు సినిమా వేదిక

దాసరి జయంతి స్పెషల్‪గా Pan India దర్శకులకు సత్కారం

దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) జయంతి (మే 4) సందర్భంగా.. దాసరి కల్చరల్ ఫౌండేషన్ (Dasari Cultural Foundation) ఆధ్వర్యంలో తెలుగు సినిమా వేదిక - ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో  పాన్ ఇండియా దర్శకులను ఘనంగా సత్కరించారు. దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు బయోపిక్ (Biopic)‪ను ‘దర్శకరత్న’(DarsakaRatna)  పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు (Tadivaka Ramesh Naidu) స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్.. తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ (Vijay Varma Pakalapati), ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా (Chaitanya Janga) సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుకను హైదరాబాద్‪లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్(FNCC)‪లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబిచ్చారు.


ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. అనంతరం సీనియర్ దర్శకులు ధవళ సత్యం(Dhavala Satyam) సారధ్యంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ ‘దర్శకరత్న’ పోస్టర్‪ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది దాసరి జయంతిని మరింత ఘనంగా నిర్వహించనున్నామని.. సూపర్ స్టార్ రజనీకాంత్ (SuperStar Rajinikanth), బాలీవుడ్ స్టార్ జితేంద్ర(Jeetendra) వంటి లెజెండ్స్‪ను సత్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రజనీకాంత్, జితేంద్రలను ఇప్పటికే నేరుగా సంప్రదించామని.. వారు సంతోషంగా సమ్మతించారని రమేష్ నాయుడు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పండిట్ తరుణ్ భట్టాచార్య.. ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి వంటి ప్రముఖులు పాల్గొని.. దాసరితో తమకున్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 

Updated Date - 2022-05-06T01:07:01+05:30 IST