Adipurush: ఆ సెంటిమెంట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం!

ABN , First Publish Date - 2022-06-08T05:04:38+05:30 IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. భారతీయ పురాణాలలో అమితంగా ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం (Ramayanam) ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్ట్రైట్ మూవీగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్

Adipurush: ఆ సెంటిమెంట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌లో భయం!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. భారతీయ పురాణాలలో అమితంగా ఇష్టపడే ఇతిహాసాలలో ఒకటైన రామాయణం (Ramayanam) ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ స్ట్రైట్ మూవీగా రూపొందుతున్న ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ (Prabhas) రాముడిగా నటిస్తున్నారు. ప్రభాస్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ (Om Raut) ఈ చిత్రాన్ని అయిదు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్‌ని మేకర్స్ కొత్తగా షూట్ చేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో సీత చిన్నప్పటి జీవితాన్ని, రాముడితో పెళ్లి వరకూ సీత జీవితంలో జరిగిన విషయాలని చూపించబోతున్నారట. 


సీత జీవితం గురించి చెప్పాలంటే ఆమె కుటుంబం గురించి కూడా చూపించాలి కాబట్టి.. తండ్రి జనకమహారాజుతో సీతకి ఉండే అనుబంధాన్ని తెరపై చూపించడానికి ఓం రౌత్ రెడీ అయ్యాడు. సీత పాత్రకి కృతి ఎలాగో ఉంది, ఇక కావాల్సింది జనకమహారాజు పాత్ర ప్లే చేయాల్సిన ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్ట్ కోసం ఓం రౌత్ చాలా సెర్చ్ చేయగా, లాస్ట్‌కి అందరికన్నా కృష్ణంరాజు (Krishnam Raju) అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటాడని ఫిక్స్ అయ్యాడట ఓం రౌత్. మిథిలాధిపతి జనకుడిగా మన రెబల్ స్టార్ కనిపిస్తారని టాక్. ఇదంతా బాగుంది కానీ.. రెబల్ స్టార్, యంగ్ రెబల్ స్టార్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నా, అదే సమయంలో వీరిద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమాలు డిజాస్టర్స్ అవుతాయనే సెంటిమెంట్‌కు ఫ్యాన్స్ భయపడుతున్నారు. 


భారీ అంచనాలతో వచ్చిన ‘బిల్లా’ (Billa), ‘రెబల్‌’ (Rebel), ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈసారైనా ఆ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదు. టాకీ పార్ట్ అయితే పూర్తి చేశారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉన్నాయట.

Updated Date - 2022-06-08T05:04:38+05:30 IST