Nithin : కెరీర్‌ను తండ్రే నాశనం చేస్తున్నాడా?

Twitter IconWatsapp IconFacebook Icon

Nithin : కెరీర్‌ను తండ్రే నాశనం చేస్తున్నాడా?

యంగ్ హీరో నితిన్ (Nithin) అంటే ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా ఇష్టం, ఎందుకంటే అతడి కెరీర్ పని అయిపోయింది, సినిమాలు లేవు, ఇక నితిన్ బ్యాక్ టు పెవిలియన్ అనే విమర్శల దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి మళ్ళీ లైం లైట్ లోకి వచ్చాడు. అందుకే నితిన్ అంటే కొంతమందికి చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కనిపించట్లేదు. నితిన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. చేసిన ఏ సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. ‘చెక్ (Check), మ్యాస్ట్రో (Mastreo)’ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యయో, ఎప్పుడు  వెళ్లిపోయాయో కూడా ఎవరికీ తెలియదు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam) సినిమా పరిస్థితి కూడా దాదాపు ఇదే. బయ్యర్స్ కి ఈ మూవీ భారి నష్టాలని మిగిలించే ఛాన్స్ లు ఉన్నాయి.


అసలు నితిన్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇష్క్ (Ishq), గుండె జారి గల్లంతయ్యిందే (GundeJaari Gallanthainde), అ ఆ’ (A aa) లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన నితిన్ ఇప్పుడు సరైన కథలు ఎందుకు ఎంచుకోవట్లేదు అనే విషయాన్ని గమనిస్తే.. నితిన్ స్టొరీ సెలక్షన్స్ లో అతని తండ్రి సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. డిస్ట్రిబ్యుషన్ నుంచి ప్రొడక్షన్ వైపు వచ్చిన సుధాకర్ రెడ్డి పెర్ఫెక్ట్ గా లెక్కలు కొలతలు వేసుకోని సినిమాలు చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లెక్కలు, కొలతలే నితిన్ ని ఇరకాట పెడుతున్నట్లు ఉన్నాయి. సుధాకర్ రెడ్డి కాస్త నితిన్‌కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, అతని కథలని అతన్ని ఎంచుకోనిస్తే నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కే అవకాశం ఉంది. లేదంటే అతి త్వరలో నితిన్ కెరియర్ అయిపోయింది అనే మాట మళ్ళీ వినాల్సి వస్తుంది.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.