పెళ్లి తర్వాత జీవితంలోని మార్పుల గురించి అభిమానులకు తెలిపిన ఫర్హాన్

ABN , First Publish Date - 2022-03-11T01:22:04+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ఫిబ్రవరి 19న

పెళ్లి తర్వాత జీవితంలోని మార్పుల గురించి అభిమానులకు తెలిపిన ఫర్హాన్

బాలీవుడ్ స్టార్ హీరో ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జావేద్ అక్తర్‌కు చెందిన ఖండాలా ఫామ్‌హౌస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహిత మిత్రులతో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. తాజాగా ఫర్హాన్ అక్తర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పెళ్లి అనంతరం తన జీవితం ఏ విధంగా మారిందో అభిమానులకు తెలిపాడు.    


పెళ్లి తరువాత జీవితంలో ఏ మార్పులు చోటు చేసుకున్నాయో తనకు తెలియదని ఫర్హాన్ అక్తర్ వివరించాడు. ‘‘నేను, శిబానీ చాలా రోజులుగా ఒకరికి మరొకరం తెలుసు. పెళ్లి అనేది అధికారికంగా ఓ ట్యాగ్‌ను ఇచ్చింది. అంతకంటే మా జీవితంలో ఏ మార్పులు చోటు చేసుకోలేదు. మేం గతంలోనే డేటింగ్ చేశాం. ప్రస్తుతం దానిని మరో లెవెల్‌కి తీసుకువెళ్లాం. ఈ బంధం అద్భుతంగా ఉంది’’ అని ఫర్హాన్ అక్తర్ వివరించాడు. 


ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ గతంలో నాలుగేళ్లు డేటింగ్ చేశారు. ఆ సమయంలో ఒకరిని మరొకరు అర్థం చేసుకున్నారు. దాంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్ సెలబ్రెటీలు హృతిక్ రోషన్, ఫరా ఖాన్, రియా చక్రవర్తి, అమృతా అరోరా తదితరులు హాజరయ్యారు. ఫర్హాన్, శిబానీ ఫిబ్రవరి 21న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

Updated Date - 2022-03-11T01:22:04+05:30 IST