ఆర్యన్ ఖాన్ కేసులో NCB‌కి పాఠాలు చెబుతోన్న ఫరా ఖాన్ అలీ

ABN , First Publish Date - 2021-10-19T00:44:50+05:30 IST

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపుగా 20మంది పట్టుబడ్డారు.

ఆర్యన్ ఖాన్ కేసులో NCB‌కి పాఠాలు చెబుతోన్న ఫరా ఖాన్ అలీ

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపుగా 20మంది పట్టుబడ్డారు. అనంతరం అతడు బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ బెయిల్ పిటిషన్ ఈ నెల 20న విచారణకు రానుంది. బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతున్న తరుణంలో జ్యూవెలరీ డిజైనర్ అయిన  ఫరా ఖాన్ అలీ ఎన్సీబీ అధికారులకు పాఠాలు చెబుతోంది. ఆ పాఠాలు ఏమిటో తెలుసుకోవాలనుందా..


అర్భాజ్ మర్చంట్‌కు వాట్సప్ లో ఆర్యన్ ఖాన్ ‘‘లెట్స్ హావ్ బ్లాస్ట్’’ అనే మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్‌ను పట్టుకుని ఆర్యన్, అర్భాజ్  డ్రగ్స్ గురించే మాట్లాడుకున్నారని కోర్టులో ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జ్యూవెలరీ డిజైనర్ అయిన ఫరా ఖాన్ అలీ నేటి యూత్ వాట్సప్‌లో ఏవిధంగా మాట్లాడుకుంటారో తెలుపుతూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ ప్రియమైన ఎన్సీబీ నేటి యూత్  వాట్సప్ చాట్‌లల్లో  ఏవిధంగా మాట్లాడుకుంటున్నారో అని గూగుల్‌లో వెతికాను. FOMO- ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, SICK-సమ్‌థింగ్ దట్ ఈస్ కూల్, DOPE-సమ్‌థింగ్ ఎక్సలెంట్, GOAT-గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, BLAST-టు హావ్ గుడ్ టైమ్ అనే పదాలు నాకు కనిపించాయి ’’ అని ట్వీట్ చేసింది.


‘‘ నేటి యూత్ అనేక విధాలుగా మాట్లాడుకుంటారు. ఇంగ్లీష్‌ని షార్ట్ చేసి  సంభాషిస్తుంటారు. చాలా కొత్తగా సరళమైన భాషలో చాట్ చేస్తుంటారు. పాత తరం వారికి అది టార్చర్‌గా అనిపిస్తుంది. యూత్ మాట్లాడే భాషను మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. వాట్సప్ చాట్‌లు ప్రైవేట్ వ్యవహారానికి సంబంధించినవి. మొబైల్‌లో వారు జరిపిన చాట్‌లు డ్రగ్స్‌కు సంబంధించినవి కావు ’’ అని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.


గతంలోనే షారూఖ్‌ఖాన్‌ కుటుంబానికి ఫరా ఖాన్ తన మద్దతును తెలిపింది. ‘‘ షారూఖ్, అతడి కుటుంబానికి నా మద్దతు ఎప్పుడు, ఎల్లప్పుడు ఉంటుంది. వ్యక్తిగతంగా వారు చాలా ఏళ్లుగా నాకు తెలుసు. షారూఖ్  చాలా మంచివాడు. వారికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా ’’ అని ఆమె ట్వీట్ చేసింది.



Updated Date - 2021-10-19T00:44:50+05:30 IST