Prabhas ‘ఆదిపురుష్’పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణమిదే!

Twitter IconWatsapp IconFacebook Icon

పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం నటిస్తున్న మైథిలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’ (Aadipurush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రివీల్ చేయడం లేదని, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సీరియస్ కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడు (Lord Rama) పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా.. సీత (Sita) పాత్రలో బాలీవుడ్ భామ కృతిసనన్ (Kriti Sanon) నటిస్తోంది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. అదే ఇయర్ నవంబర్‌కి షూటింగ్ పూర్తి చేశారు. ముంబైలో వేసిన స్పెషల్ సెట్స్‌లో ఈ సినిమా ఎక్కువ భాగం షూట్ చేశారు. ఈ సినిమా కోసం లేటెస్ట్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఒకే టైమ్‌లో హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు భారీగా VFX వర్క్స్ చేయాల్సివుంది. అందుకే షూటింగ్ కంప్లీట్ అయినా ఇంత వరకు ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయలేదు మూవీ మేకర్స్. 


లాస్ట్ ఇయర్ శ్రీరామనవమి (Srirama Navami)కి ‘ఆదిపురుష్’ ఫస్ట్ లుక్ వస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ శ్రీరామనవమికైనా ప్రభాస్ లుక్ వస్తుందని ఆతృతగా వేచి చేశారు. కానీ మేకర్స్ మాత్రం ఫ్యాన్ మేడ్ పోస్టర్స్‌తో సరిపెట్టారు. ‘ఆదిపురుష్’ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. అంటే రిలీజ్‌కు ఎనిమిది నెలల సమయం కూడా లేదు. కానీ ఇప్పటివరకు ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీకాదు కదా.. కనీసం ఒక పోస్టర్ కూడా రివీల్ చేయలేదు. 

Prabhas ఆదిపురుష్పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణమిదే!

ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని చేతిలో పెట్టుకొని అప్ డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వచ్చే నెలలో‌నైనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ (Radhe Shyam) విషయంలో కూడా అభిమానులు మొదట్లో ఇటువంటి అసహనాన్నే వ్యక్తి పరిచి.. నిర్మాణ సంస్థని ట్రోల్ చేశారు. ‘ఆదిపురుష్’ టీమ్‌పై కూడా ఫ్యాన్స్ ప్రస్తుతం అలాంటి మూడ్‌లోనే ఉన్నారు. మరి అంతగా వేచిచూస్తున్న వారి కోసం మేకర్స్ ఏమైనా అప్‌డేట్ ఇస్తారో లేదో.. చూద్దాం.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.