బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan). వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా ‘టైగర్-3’ (Tiger-3) సినిమాలో నటించారు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషించారు. ‘ఈద్’ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సల్లూ భాయ్ అప్పుడప్పుడు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం ‘ద ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ’ (ఐఫా)(IIFA) అవార్డ్స్‌ను హోస్ట్ చేశారు. దుబాయ్‌లోని యాష్ ఐ ల్యాండ్‌లో జులై 14, 15, 16తేదీల్లో ఈ వేడుకలు జరిగాయి. ఈ అవార్డ్స్ ఫంక్షన్ త్వరలోనే టీవీలోనే ప్రసారం కానుంది. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో సల్మాన్‌తో పాటు సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఆడియన్స్‌తో నవ్వులు పూయించారు.
ఈ వీడియోలో.. సల్మాన్ అంకుల్‌తో కలసి కొన్ని బ్రాండ్‌లను లాంచ్ చేయబోతున్నానని సారాఅలీ ఖాన్ చెప్పారు. అందుకు సల్మాన్ వెంటనే నీ సినిమా పోయిందని తెలిపారు. అందుకు సారా అమాయకంగా ఎందుకు అని అడిగారు. ‘‘నీకు నా పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చి ఉండేది. కానీ, నువ్వు అందరి ముందు నన్ను అంకుల్ అని పిలిచావు’’ అని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. మీరే కదా అంకుల్ అని పిలవమన్నారని సారా తెలిపారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కబీ ఈద్, కబీ దివాళీ’ (Kabhi Eid Kabhi Diwali)లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ బాయ్‌జాన్ సొంత నిర్మాణ సంస్థ ‘సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్’ (Salman Khan Films) నిర్మిస్తుంది. ఈ మూవీలో పూజా హెగ్డే(Pooja Hegde), వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్లో మూవీని విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.