Brahmastra లో ShahRukh Khan ఉన్నాడా..? టీజర్‌లో కనిపించిన ఈ పాత్ర షారూఖ్‌దేనంటూ నెటిజన్స్ ట్వీట్లు..!

ABN , First Publish Date - 2022-06-02T20:44:00+05:30 IST

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’(Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan

Brahmastra లో ShahRukh Khan ఉన్నాడా..? టీజర్‌లో కనిపించిన ఈ పాత్ర షారూఖ్‌దేనంటూ నెటిజన్స్ ట్వీట్లు..!

బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’(Brahmastra Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వ్యవహరించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. దక్షిణాది భాషలకు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయనున్నారు. అందులో భాగంగా టీజర్ ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ టీజర్‌లో చిత్రానికీ సంబంధించిన ముఖ్య పాత్రలను చూపించారు. 


‘బ్రహ్మాస్త్ర’ టీజర్ ట్రైలర్ విడుదల కాగానే నెట్టింట ట్రెండ్ కావడం మొదలయింది. ప్రతి ఒక్కరు నటుల ఫస్ట్ లుక్‌ల‌ను గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని కొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. మరికొంత మంది అతడి లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు కూడా పెడుతున్నారు. అయితే, ఈ మూవీలో షారూఖ్ ఉన్నాడా, లేదా తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ’ త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా సినిమా నుంచి ‘కుంకుమలా’(Kumkumala) తెలుగు పాటను విడుదల చేసింది. ఈ పాటను ఎస్ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సాంగ్ లిరిక్స్‌ను చంద్రబోస్ రాశారు. సిద్ శ్రీరామ్ అలపించారు. ‘బ్రహ్మాస్త్ర’ హిందీ వెర్షన్ నుంచి గతంలోనే మేకర్స్ ‘కేసరియా’ అనే పాటను రిలీజ్ చేశారు. ఆ పాటకు తెలుగు వెర్షనే ‘కుంకుమాలా’.



Updated Date - 2022-06-02T20:44:00+05:30 IST