Priyanka Chopra: హాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్‌తో బాలీవుడ్ బ్యూటీ.. ముగ్గురిని ఓకే ప్రేములో చూసిన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-07T18:53:30+05:30 IST

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. ఇక్కడ కెరీర్‌ పీక్‌లో ఉండగానే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన...

Priyanka Chopra: హాలీవుడ్ లేడీ సూపర్ స్టార్స్‌తో బాలీవుడ్ బ్యూటీ.. ముగ్గురిని ఓకే ప్రేములో చూసిన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. ఇక్కడ కెరీర్‌ పీక్‌లో ఉండగానే హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారతదేశంలో మాదిరిగానే పెద్ద పెద్ద బ్రాండ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌కి ఆహ్వానించేంతగా తన స్టార్ డమ్‌ని పెంచుకుంది. ఈ బ్యూటీ తాజాగా బల్గరీకి కొత్త జ్యూయలరీ‌ ‘ఈడెన్ ది గార్డెన్ ఆఫ్ వండర్స్’ లాంచ్ కోసం పారీస్ వెళ్లింది. అదే కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హతావే, పాప్ సింగర్  లిసా కూడా అతిథులుగా వచ్చారు.


ఈ తరుణంలో ఈ ముగ్గురు స్టార్స్ కలిసిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిన వారి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది నిజమా లేక కలగంటున్నామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముగ్గురు కలిసిన ఉన్న పిక్‌ని ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్‌లో అన్నేకి, లిసా మధ్యలో ప్రియాంక ఉంది. దానికి.. ‘అక్కడ మేమున్నాం. అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది.


దీనిపై ప్రియాంక భర్త, హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ స్పందిస్తూ ముగ్గురు హాట్‌గా ఉన్నారనే ఉద్దేశంతో మూడు ఫైర్ ఎమోజీలను కామెంట్ చేశాడు. అలాగే.. ‘ప్రపంచంలోని ముగ్గురు బెస్ట్ మహిళలు ఓకే చోట కలిశారు. ఎవరికీ వారే ప్రత్యేకమైన వ్యక్తులు. మీరు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ‘ఓ మై గాడ్.. అన్నే, ప్రి, లిసా ఒకే ఫ్రేములో ఉన్నారు. ఇది కలకాదు కదా’ అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.





Updated Date - 2022-06-07T18:53:30+05:30 IST