లాస్ ఏంజెల్స్‌లో ప్రియాంక, నిక్‌ను కలిసిన వ్యాపారవేత్త.. గ్రేట్ హోస్టంటూ..

ABN , First Publish Date - 2022-04-27T15:56:05+05:30 IST

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. అనంతరం ఈ బ్యూటీ హాలీవుడ్‌లో అడుగుపెట్టి..

లాస్ ఏంజెల్స్‌లో ప్రియాంక, నిక్‌ను కలిసిన వ్యాపారవేత్త.. గ్రేట్ హోస్టంటూ..

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. అనంతరం ఈ బ్యూటీ హాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమ వివాహం చేసుకోగా.. ఈ జంటకి సరోగసీ ద్వారా ఓ పాప కలిగిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఇంటికి ఈ జంటని కలిసేందుకు ప్రముఖ ఫిలాన్‌త్రోఫిస్ట్, వ్యాపారవేత్త పింకి రెడ్డి వెళ్లారు. దీనికి సంబంధించి ప్రియాంక దంపతులతో కలిసి దిగిన పిక్ పింకి రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


పింకి రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో ప్రియాంక దంపతులతోపాటు వారి ఇల్లు కనిపిస్తోంది. ఆ పిక్‌కి.. ‘డిన్నర్ కోసం ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ని లాస్ ఏంజెల్స్‌లోని వారి ఇంట్లో కలవడం ఆనందంగా ఉంది’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అయితే.. ఆ పిక్‌లో వారి ఇల్లు కూడా కనిపిస్తుండడంపై పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘వారి ఇంటిని పూర్తిగా చూడాలి’, ‘లవ్ లీ కపుల్’, ‘మంచి ఇల్లు’ అంటూ కామెట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-04-27T15:56:05+05:30 IST