ఒంటిపై ఏమాత్రం దుస్తులు లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో Britney Spears ఫొటోలు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-11T18:55:12+05:30 IST

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌ పాటలకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ భామ సోషల్ మీడియాలో..

ఒంటిపై ఏమాత్రం దుస్తులు లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో Britney Spears ఫొటోలు.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్‌ పాటలకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ భామ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ బ్యూటీ 13 ఏళ్లపాటు తండ్రి జెమీ స్పియర్‌ సంరక్షణలో ఉండి ఇటీవలే అందులోంచి బయటపడింది. అప్పటి నుంచి బ్రిట్నీ సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్‌గా ఉంటోంది.


తాజాగా ఈ తార తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మెక్సికోలో ఎంజాయ్ చేస్తోంది. ఈ తరుణంలో దిగిన కొన్ని న్యూడ్ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒంటిపై ఏమాత్రం బట్టలు లేకుండా కేవలం రెండు చేతులు అడ్డుపెట్టుకొని ఉంది. అంతేకాకుండా ఈ పిక్స్‌తో తన కడుపులో ఓ బేబీ ఉంది అని హింట్ కూడా ఇచ్చింది. ఈ పిక్స్‌పై ఎంతోమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అందులో.. ‘ఆమెకి ఆరోగ్యం బాగాలేనట్టుంది. సహాయం కోసం చూస్తోంది’ అని కొందరు.. ‘తండ్రి కంట్రోల్‌లో ఉంచడానికి ఇలాంటివే కారణం అనుకుంటా’ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2022-05-11T18:55:12+05:30 IST