Viral Video: వీధుల్లో నిలబడి జనాలకు ఫ్రీ హగ్స్ ఇస్తున్న బాలీవుడ్ భామ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-02-18T17:52:32+05:30 IST

కొంతమంది సెలబ్రిటీలు జనాలకు మంచి జరిగేలా, పాజిటివ్ ఆలోచనలు పెరిగేలా కొన్ని పనులు చేస్తుంటారు. దాంతో ఎంతోమంది నుంచి ప్రశంసలు సైతం పొందుతుంటారు...

Viral Video: వీధుల్లో నిలబడి జనాలకు ఫ్రీ హగ్స్ ఇస్తున్న బాలీవుడ్ భామ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

కొంతమంది సెలబ్రిటీలు జనాలకు మంచి జరిగేలా, పాజిటివ్ ఆలోచనలు పెరిగేలా కొన్ని పనులు చేస్తుంటారు. దాంతో ఎంతోమంది నుంచి ప్రశంసలు సైతం పొందుతుంటారు. తాజాగా అలాంటి పనే చేసి బాలీవుడ్ నటి రిచా చద్దా ఫ్యాన్స్ మనసులను కొల్లగొట్టింది.


ముంబైలోని వీధుల్లో నిలబడి ప్రజలు తమ బాధలు మరిచిపోయేందుకు రిచా ‘ఫ్రీ హగ్‌’ క్యాంపెయిన్‌ని నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఎంతోమంది యువతి, యువకులు, మహిళలు వచ్చి ఈ భామకి హగ్స్ ఇచ్చారు. దీంతో ఈ బ్యూటీపై ఎంతోమంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘పాజిటివ్ వైబ్స్‌ని అందరికి పంచడం చాలా అద్భుతం’ అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరోవైపు కరోనా టైమ్‌లో మాస్క్ లేకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు సైతం చేస్తున్నారు. ఆ వైరల్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..



Updated Date - 2022-02-18T17:52:32+05:30 IST