మంగళసూత్రంతో Katrina Kaif.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-01-04T19:09:01+05:30 IST

దాదాపు రెండు సంవత్సరాల రహస్య డేటింగ్ తర్వాత బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే...

మంగళసూత్రంతో Katrina Kaif.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

దాదాపు రెండు సంవత్సరాల రహస్య డేటింగ్ తర్వాత బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అత్యంత గ్రాండ్‌గా వివాహం చేసుకుంది ఈ జంట. అయితే ఎంతో రహస్యంగా జరిగిన ఈ మ్యారేజ్‌ గురించి అనంతరం సోషల్ మీడియాలో ప్రకటించింది క్యాట్.


పెళ్లి తర్వాత మినీ హనీమూన్‌కి వెళ్లొచ్చిన ఈ జంట అనంతరం ముంబైలోని జుహులోని ఓ సీ ఫేసింగ్‌ ఇంటికి షిప్ట్ అయ్యింది. తాజాగా ఈ ఇంట్లో దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ కత్రినా. అందులో బెగీ జిప్‌తో ఉన్న కార్డిగాన్‌ని ధరించింది.  అయితే ఈ పిక్స్ వారి ఇంటితో పాటు ఆమె మెడలోని మంగళ సూత్రం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకర్షించింది. దీంతో వరుస కామెంట్స్ పెడుతూ అభిమానాన్ని కురిపిస్తున్నారు నెటిజన్లు.




ఆ ఫోటోలను విక్కీ తీశాడని భావిస్తున్న నెటిజన్లు.. ‘అవి ఎవరు తీశారో మాకు తెలుసం’టూ కామెంట్స్ పెడుతున్నారు. ‘మీ చాలా బావున్నాయి. అలాగే పెడుతూ ఉండండ’ని ఓ యూజర్ రాశాడు.కాగా ఎక్కువ మంది మంగళ సూత్రాన్ని గుర్తించి.. ‘మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఆ మంగళసూత్రం కూడా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ఎవరు ఎంత చెప్పినా, మంగళసూత్రం కంటే ప్రత్యేకమైంది ఏదీ లేద’ని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. కత్రినా క్యూట్ పిక్స్‌ని మీరు ఓ సారి చూసేయండి..

Updated Date - 2022-01-04T19:09:01+05:30 IST