Puri jagannadh: అరేయ్‌ పూరి, ఉట్‌ సాలే.. నీకన్నా తోపు ఎవడు?

ABN , First Publish Date - 2022-08-27T01:47:14+05:30 IST

భారీ అంచనాల మధ్య విడుదలైన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, అసలు ‘లైగర్‌’ను డైరెక్ట్‌ చేసింది పూరి జగన్నాథ్‌యేనా అని షాక్‌లో ఉన్నారు. హిట్స్‌, ఫ్లాఫ్స్‌ కామన్‌ కాని క్లైమాక్స్‌ కూడా లేకుండా, ప్రాపర్‌ క్లోజింగ్‌ లేకుండా పూరి ఒక సినిమాని తెరకెక్కించడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

Puri jagannadh: అరేయ్‌ పూరి, ఉట్‌ సాలే.. నీకన్నా తోపు ఎవడు?

భారీ అంచనాల మధ్య విడుదలైన ప్యాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ ఫ్లాప్‌ అవ్వడంతో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ, అసలు ‘లైగర్‌’(liger)ను డైరెక్ట్‌ చేసింది పూరి జగన్నాథ్‌యేనా (puri jagannadh)అని షాక్‌లో ఉన్నారు. హిట్స్‌, ఫ్లాఫ్స్‌ కామన్‌ కాని క్లైమాక్స్‌ కూడా లేకుండా, ప్రాపర్‌ క్లోజింగ్‌ లేకుండా పూరి ఒక సినిమాని తెరకెక్కించడమే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. లైగర్‌ మూవీని ఫస్ట్‌ డే, ఫస్ట్‌ షో చూసిన ఒక డై హార్డ్‌ ఫ్యాన్‌... పూరికి లెటర్‌ రాశాడు (Fan letter to Jaganadh). అందులో... ‘నీకు చెప్పక్కర్లేదు, నువ్వు చూడని లో కాదు... కానీ ఇది మేము ఎక్స్‌పెక్ట్‌ చేయని లో, నెక్స్ట్‌ టైం నీతో నువ్వు కొట్లాది రా... బాకీ తీర్చేద్దువ్‌, ఉట్‌ జా సాలా’ అని రాశాడు. సీరియస్లీ స్పీకింగ్‌, పూరి మత్తు వదిలించుకొని సినిమాలు చేయాల్సిన సమయం వచ్చింది. వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ దేర్‌ లివిడ్‌ ఎ ఘోస్ట్‌’ అన్నట్లు, పూరి ఈజ్‌ ఏ ట్రూ ఫైటర్‌. ఇప్పుడు పూరి సినిమా అంటే అమ్మాయిలు, మందు, బూతులు కనిపిస్తున్నాయి కానీ... పూరి సినిమా అంటేనే బ్యూటిఫుల్‌ బీచ్‌ సాంగ్స్‌, అది లేకుండా లైగర్‌ని ఎలా తీశావ్‌ బాసూ! ఇడియట్‌ నుంచి ఇస్మార్ట్‌ శంకర్‌ వరకూ బీచ్‌ సాంగ్‌ కావాలి అంటే నీ సినిమాకే వచ్చే వాళ్లం అలాంటిది అది వదిలేసి సినిమా ఎలా చేశావ్‌? అది ఇది నువ్వేనా? నీ ఫిలాసపికి ఎవడైనా ఫిదా అవ్వాల్సిందే, నీ హీరో మాట్లాడుతుంటే ఎవడైనా వినాల్సిందే, అలాంటిది హీరోని నత్తి పెట్టి... డైలాగులు రాయకుండా నీ చేతులు నువ్వే నరికేసుకున్నావ్‌ పూరి. 


నీ సినిమా అంటేనే.. హీరో ఆటిట్యూడ్‌ పీక్స్‌లో ఉంటుంది. నీ హీరో మ్యానరిజమ్స్‌ని ఎవ్వడైనా ఫాలో అవ్వాల్సిందే. శివమణి నాక్కొంచెం మెంటల్‌ అంటే, విజిల్స్‌ వేసాం.. బద్రి బద్రీనాథ్‌ అనే డైలాగ్‌ని రిపీట్‌ మోడ్‌ లో విన్నాం. ఎప్పుడు వచ్చాం అని కాదన్నయ్య బులెట్‌ దిగిందా లేదా అంటే బాక్సాఫీస్‌కే బుల్లెట్‌ దించాం. టిప్పర్‌ లారి వెళ్లి స్కూటర్‌ని గుద్దేేస్త ఎలా ఉంటుందో తెలుసా అంటే ప్రభాస్‌ని స్టార్‌ హీరోని చేశాం. నీ సినిమాలో లవ్‌ ట్రాక్స్‌ చూసి, ఇష్టపడిన అమ్మాయికి మా ప్రేమని భయం లేకుండా చెప్పే ధైర్యం వచ్చింది. అలాంటిది ప్రేమనే వదిలేసి విజయ్‌ అండ్‌ అనన్య  మధ్య ఆ లవ్‌ ట్రాక్‌ ఏంటి గురు? ప్రేమ అనే ఎమోషన్‌ని మర్చిపోయావా ఏంటి? బద్రి నుంచి నువ్వు రాసే కామెడీ ట్రాక్స్‌ని చూసి నవ్వుతూనే ఉన్నాం. ఈరోజుకి మాకు ఇడియట్‌లో ఇసక బస్తాలు తీసుకెళ్లిన ఆలీ గుర్తున్నాడు, బ్రహ్మి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుర్తున్నాడు... ఏమిరా బాలరాజు, ఏమిరా దేశానికి  నీ వల్ల్ల ఉపయోగం, పోనీ ఏదైనా పని చేసుకోరా అని తిట్టిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తున్నారు. ఇలాంటి ఎవర్‌ లాస్టింగ్‌ ఫన్‌ని జనరేట్‌ చేసిన నువ్వు.. లైగర్‌లో ఒక్క కామెడీ సీన్‌ కూడా సరిగ్గా ఎందుకు పెట్టలేదు? కామెడి రాసిన ఒకప్పటి పూరి నేను కాదు అంటావా? నీ సినిమాల్లో హీరో హీరోయిన్లే కాదు బాసు, పక్కన ఉండే క్యారెక్టర్స్‌ కూడా చాలా స్ర్టాంగ్‌గా ఉంటాయి. ఈ విషయాన్ని కన్ఫమ్‌ చేయడానికి టెంపర్‌లోని పోసాని క్యారెక్టర్‌, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయిలో జయసుధ ప్రకాష్‌రాజ్‌లను మించిన ఉదాహరణలు కావాలా చెప్పు? లైగర్‌లో ఇలాంటి పాత్రని ఒక్కటైనా చూపించు? నాలో ఉన్న ఆ రైటర్‌ పెగ్‌ వేసి పడుకున్నాడు అంటావా? నీ స్పీడ్‌కి, నీ రైటింగ్‌కి, నీ మేకింగ్‌కి... రాజమౌళి, సుకుమార్‌ లాంటి ప్యాన్‌ ఇండియా డైరెక్టర్లు కూడా వణికిపోతారు. అలాంటిది నువ్వు మూడేళ్ళు ఒక సినిమాని చేయడం ఏంటి మావా... లే ఇది నువ్వు కాదు, మాకు పాత పూరిని ఇవ్వు. ఆ వింటేజ్‌ పూరిని చూపించు, అలా ఒక్క సినిమా అయినా చెయ్‌ మావా చూసి కాలర్‌ ఎగరేసుకుంటూ థియేటర్‌ నుంచి బయటకి వస్తాం. నీ ఫ్యాన్‌ని కదా, నీ స్టైల్‌లోనే చెప్తా. 


అరేయ్‌ పూరి ఉట్‌ గా సాలే... నీకన్నా తోపు ఎవడు లేడిక్కడ. నీ టార్గెట్‌ హిట్‌ అయితే ఎయిమ్‌ ఫర్‌ ఇండస్ర్టీ హిట్‌. నువ్వూ, నిన్ను ఇష్టపడే నేనూ... ఇద్దరం వార్‌ జానర్‌లో ఉన్నాం. ఎక్‌ బార్‌, బస్‌ ఎక్‌ బార్‌, సబ్కీ వాట్‌ లగా దే... అగ్లే బార్‌ థియేటర్‌ కే పాస్‌ మిలేంగే, హిట్‌ మారెంగే పార్టీ కరేంగే! 


Updated Date - 2022-08-27T01:47:14+05:30 IST