NTR30పై ఇంట్రెస్ట్ పోయింది

ABN , First Publish Date - 2022-10-06T17:51:43+05:30 IST

ఇది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ అనుకుంటున్న మాట. ఎప్పుడెప్పుడు

NTR30పై ఇంట్రెస్ట్ పోయింది

ఇది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన ‘NTR30’ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ అనుకుంటున్న మాట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మొదలవుతుందా? అని ఎంతోకాలం నుండి ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ (RRR)లో కలిసి నటించిన రామ్ చరణ్ (Ram Charan) నుండి ‘ఆచార్య’ (Acharya) సినిమా వచ్చింది. ఇప్పుడు ‘RC15’ సెట్స్‌పై ఉంది. కానీ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో.. ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇక విజయానికి చిహ్నంగా చెప్పుకునే విజయదశమి రోజు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్‌డేట్ లేకపోవడంతో.. రాకపోవడంతో.. అభిమానులు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పోయిందంటూ, సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. విజయదశమికి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్ వస్తుందని.. అభిమానులు ఎంతగానో వేచి చూశారు. కానీ, మేకర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. దీంతో అభిమానులు (Fans) నిరాశను వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికపై ‘NTR30’పై కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు.  


వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పై ఉండాలి. ఒకసారి హీరోయిన్ కారణంగా అని, ఇంకోసారి ‘ఆచార్య’ నష్టాల కారణంగా అంటూ.. ఏదేదో వినిపిస్తూ వస్తుంది. ఇప్పుడు మళ్లీ కొరటాల ఈ సినిమా కథని ఇంకాస్త పకడ్బందీగా తయారు చేస్తున్నాడనేలా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించడంతో.. ఫ్యాన్స్ ‘NTR30’పై ఆశలు వదిలేసుకోవడం బెటర్ అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరైతే.. కొరటాలను వదిలేసి.. ‘ఉప్పెన’ బుచ్చిబాబు (Uppena Buchi Babu) సినిమాతోనైనా సినిమా చేస్తే బాగుండు.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. అంతగా NTR30పై వారికి నీరసం వచ్చేసింది. మరోవైపు బుచ్చిబాబు కథ సిద్ధం చేసుకుని.. ఎన్టీఆర్ కోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ, కొరటాల సినిమా తర్వాత.. లేదంటే, ఆ సినిమాతో పాటే బుచ్చిబాబు సినిమా కూడా మొదలవుతుందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే, కొరటాల ఇంకా ఈ సినిమా కథని చెక్కుతున్న తీరే.. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ అనుమానాలతో అసలు వీరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా? అని ఫ్యాన్స్ చేస్తోన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఫ్యాన్స్ కోసమైనా.. ‘NTR30’ టీమ్ ఏదో ఒక విషయం చెబితే బాగుండు.. లేదంటే వారి ఆవేదనకు అంతే ఉండదు. 

Updated Date - 2022-10-06T17:51:43+05:30 IST