MegastarKalyanRam: రెచ్చగొడుతోన్న నందమూరి ఫ్యాన్స్!

ABN , First Publish Date - 2022-08-07T04:45:56+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా రన్ అవడమే కాకుండా.. కొన్ని నెలలుగా హిట్ కోసం వేచి చూస్తున్న ఇండస్ట్రీకి ఉత్సాహమిచ్చింది. అయితే ఈ విజయాన్ని

MegastarKalyanRam: రెచ్చగొడుతోన్న నందమూరి ఫ్యాన్స్!

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా రన్ అవడమే కాకుండా.. కొన్ని నెలలుగా హిట్ కోసం వేచి చూస్తున్న ఇండస్ట్రీకి ఉత్సాహమిచ్చింది. అయితే ఈ విజయాన్ని కూడా ‘కొందరు’ నందమూరి ఫ్యాన్స్ (Nandamuri Fans) ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ వార్‌కి కారణం అవుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్‌గా పేరున్న చిరంజీవి (Chiranjeevi)ని అవమానించేలా.. ‘ఆచార్య’ (Acharya) చిత్రాన్ని ‘బింబిసార’ చిత్రంతో పోల్చుతూ నందమూరి కళ్యాణ్‌రామ్‌ని.. ‘మెగాస్టార్ కళ్యాణ్ రామ్’ (Megastar Kalyan Ram) అంటూ సంభోదిస్తూ.. మెగాభిమానులను రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో MegastarKalyanRam అనే ట్యాగ్ వైరల్ అవడం చూస్తుంటే.. ఎంతగా నందమూరి అభిమానులు, మెగాభిమానులను రెచ్చగొడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 


అయితే ఈ వార్ ఇప్పటిది కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం విడుదలైనప్పటి నుండి మెగా, నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చరణ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని నందమూరి అభిమానులు, చరణ్‌ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడని మెగాభిమానులు.. ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు. ‘ఆచార్య’ సినిమా రిజల్ట్ తర్వాత నందమూరి అభిమానులు.. మరింతగా మెగా హీరోలను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ‘మీరెన్ని కామెంట్స్ చేసుకున్నా.. ఎంతగా ప్రయాస పడినా.. మెగా టాప్ హీరోల ప్లాప్ సినిమాలకి వచ్చిన కలెక్షన్లతో.. మీ సూపర్ హిట్ సినిమాల కలెక్షన్లు సమానం’ అంటూ మెగాభిమానులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఇప్పుడు రాకరాక హీరోకి, ఇండస్ట్రీకి వచ్చిన హిట్‌ని ఎంజాయ్ చేయకుండా.. ఇలా వివాదాలకు తెరలేపడం ఏంటని.. ఇండస్ట్రీలోని వారు కూడా ఈ వార్‌పై కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు కళ్యాణ్ రామ్ మాత్రం చిరు ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, చరణ్‌ ‘మగధీర’ చిత్రాలను ‘బింబిసార’ విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నామని చెబుతున్నారు. అలాగే చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులమని ఇప్పటికే ఎన్నో సందర్భాలలో చెప్పారు. అయినా కూడా అటు మెగా, ఇటు నందమూరి అభిమానులలో ‘కొందరు’ రెచ్చిగొట్టే ధోరణి మాత్రం మానుకోవడం లేదు. ఇక ఇప్పుడీ MegastarKalyanRam ట్యాగ్ కాంట్రవర్సీ ఎంత వరకు వెళుతుందో చూడాలి.





Updated Date - 2022-08-07T04:45:56+05:30 IST