The Gray Man: ఇండియన్ హీరో కొత్త ప్రొమో విడుదల.. ఇక్కడే బెటర్ అంటున్న Dhanush ఫ్యాన్స్

ABN , First Publish Date - 2022-07-12T17:20:43+05:30 IST

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న తమిళ నటుడు ధనుష్. ఈ స్టార్ హీరో బాలీవుడ్‌లోనూ పలు హిట్..

The Gray Man: ఇండియన్ హీరో కొత్త ప్రొమో విడుదల.. ఇక్కడే బెటర్ అంటున్న Dhanush ఫ్యాన్స్

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ పాపులారిటీ ఉన్న తమిళ నటుడు ధనుష్. ఈ స్టార్ హీరో బాలీవుడ్‌లోనూ పలు హిట్ చిత్రాలు చేసి గుర్తింపు పొందాడు. ఇప్పుడూ మరో అడుగు ముందుకేసి హాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. హాలీవుడ్ దర్శక ద్వయం ఆంథోనీ రస్సో, జో రస్సో ‘అవెంజర్స్’ సిరీస్ సినిమాలతో ఇండియాలోనూ మంచి గుర్తింపు సాధించారు. ఈ రస్సో బ్రదర్స్ తాజాగా ‘ది గ్రే మ్యాన్’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ మూవీలో ‘కెప్టెన్ అమెరికా’ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించిన క్రిస్ ఇవాన్స్‌తోపాటు ధనుష్ కలిసి నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ధనుష్ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా ఓ ప్రొమోని మూవీ టీం విడుదల చేసింది. ఈ వీడియోలో ధనుష్ ఓ లేడీ, ఓ జెంట్‌తో స్టైలిష్ ఫైట్ చేస్తాడు. 54 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు ధనుష్ అభిమానులు ఈ ప్రోమోపై స్పందిస్తున్నారు.


‘తమిళ సినిమాలలో 20 మందితో ఫైట్ చేసే ధనుష్‌కి ఇది కేక్‌వాక్ అవుతుంది’ అని కొందరు అభిమానులు.. ‘ధనుష్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు’ అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. కాగా.. ధనుష్ అభిమానుల్లో కొందరికీ ఈ ప్రోమో నచ్చలేదు. దీంతో.. ‘అంతబాగా అనిపించడం లేదు. కోలీవుడ్, బాలీవుడ్‌లోనే బెటర్. ఇక్కడే ధనుష్ దీనికి మించిన స్టంట్స్ చేశాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అయితే.. ఇంతకుముందు విలేకరుల సమావేశంలో ధనుష్ మాట్లాడుతూ.. ‘నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నాను. అయితే ఈ సినిమా గురించి ఎక్కువగా చెప్పలేను. కానీ నేను నిజంగా చాలా థ్రిల్ అయ్యాను. నా గురించి మరింత ప్రూవ్ చేయడానికి మంచి అవకాశం కోసం చూస్తున్నాను. కాగా.. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 22న విడుదల కానుంది.



Updated Date - 2022-07-12T17:20:43+05:30 IST