Ram Charanకు అభిమాని వినూత్న కానుక

ABN , First Publish Date - 2022-05-28T19:22:03+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)కు వీరాభిమాని (Fan) ఓ వినూత్న కానుకను అందివ్వడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చగా మారింది. ఏదైనా కొత్తగా చేస్తేనే అందరి మెప్పు పొందుతామనే విజయ

Ram Charanకు అభిమాని వినూత్న కానుక

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan)కు వీరాభిమాని (Fan) ఓ వినూత్న కానుకను అందివ్వడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చగా మారింది. ఏదైనా కొత్తగా  చేస్తేనే అందరి మెప్పు పొందుతామనే విజయ సూత్రాన్ని నమ్మిన జైరాజ్ (Jairaj) మెగాహీరోలకు వీరాభిమాని. తన చిన్నతనం నుంచి ఆర్ట్ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ రామ్ చరణ్‌ చిత్రాల్ని పొలాల్లో పండించి ఆయనపై ఉన్న ఆకాశమంత అభిమానాన్ని చాటుకున్నారు. చరణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన వరిచిత్రాల్ని పండించాడు.గద్వాల్ జిల్లా గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి ప్రాంతంలో పొలాల్ని కౌలుకు తీసుకుని  రామ్ చరణ్‌ వరిచిత్రాన్ని వేయడం ప్రారంభించాడు జైరాజ్.


బాగా ఎత్తునుంచి ఈ చిత్రాన్ని తీస్తే రామ్ చరణ్‌ చిత్తరువు స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకోసం మూడునెలల శ్రమపడ్డాడు. జైరాజ్ వరినాట్లేసి బొమ్మను చిత్రీకరించారు. ప్రతి పుట్టినరోజు నాడు కొత్తగా ఏదో చేసి అభిమాన హీరోకి అంకితం చేయాలన్న తపనతో ఉన్న జైరాజ్.. అభిమాని అంటే ఇలా ఉండాలనే విధంగా తనని తాను తీర్చి దిద్దుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా రామ్ చరణ్‌తో కలయిక తన ఊరినుంచి హైదరాబాద్‌లోని రామ్ చరణ్‌ ఇంటిదాకా 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ఆయన్ని స్వయంగా కలుసుకున్నాడు జైరాజ్. ఆయన్ని కలుసుకున్న క్షణాలు గుండెల్లో పెట్టుకుని భద్రపరుచుకునన్నాడు. అమ్మ నాన్న లేరని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తూ.. ఇప్పుడు రామ్ చరణ్‌ వరిచిత్రాన్ని పొలాల్లో పండించేందుకు వేల రూపాయలదాకా ఖర్చయిందన్నాడు. 


అప్పుచేసి ఖర్చుచేయదంటూ స్వామి నాయుడు గారు సూచించారని తెలిపాడు. USలో ఉన్న విజయ్ రేపల్లె ఈ చిత్రాలు పండించేందుకు అయ్యే ఖర్చును భరించారని జైరాజ్ చెప్పాడు. అడుగడుగునా స్వామినాయుడు గారు అందిస్తున్న ప్రోత్సహం మరిచిపోలేనిది అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న మెగా పవర్ రామ్ చరణ్‌.. జైరాజ్‌ను తన నివాసానికి పిలిపించుకుని సుమారు 45 నిముషాలు మాట్లాడి అతనికి ఆర్థిక సహాయం చేయడమేగాక, అతని మేధస్సు మెచ్చుకుని సినీపరిశ్రమలో తగిన స్థానం కల్పిస్తామని మాట ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా.. జైరాజ్ మాట్లాడుతూ.. 'మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఇంత సప్పోర్ట్ చేస్తున్న రామ్ చరణ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను'.. అని తెలిపాడు.

Updated Date - 2022-05-28T19:22:03+05:30 IST