చలికాలంలో దుప్పట్లలా.. వేసవిలో బీర్ పంపిణీ చేయమన్న ఫ్యాన్.. సోనూసూద్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-07T16:43:35+05:30 IST

సోనూసూద్.. దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కరోనా గడ్డు పరిస్థితుల కారణంగా..

చలికాలంలో దుప్పట్లలా.. వేసవిలో బీర్ పంపిణీ చేయమన్న ఫ్యాన్.. సోనూసూద్ రియాక్షన్ ఏంటంటే..

సోనూసూద్.. దేశవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కరోనా గడ్డు పరిస్థితుల కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించినప్పుడు ఎంతోమంది ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. అలాంటి ఎంతోమందికి రవాణా, ఫుడ్ వంటివి అందించి మానవత్వం చాటుకున్నాడు. అయితే ఏ విషయం జరిగిన వాటిపై సోషల్‌మీడియాలో మీమ్స్ వస్తుంటాయి. 


అన్నింటిలాగే సోనూ మీద, ఆయన సోషల్ సర్వీస్ మీద కూడా మీమ్స్ వచ్చాయి. దానికి సంబంధించిన ఓ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. చలికాలంలో దుప్పట్లు అందించేవారు చాలామంది ఉంటారు. అలాగే వేసవి కాలంలో చల్లని బీర్ కూడా పంపిణీ చేస్తే బావుంటుందని ఉంది. ఈ పోస్ట్‌ని సోనూసూద్‌ని ఉద్దేశిస్తూ ఓ ఫ్యాన్ ఆ మీమ్‌ని షేర్ చేశాడు. దీంతో ఆ పోస్ట్‌పై సోనూ స్పందించాడు. దానికి.. ‘బీర్‌తోపాటు స్టఫ్ కూడా ఉంటే బావుంటుంది?’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆయన రిప్లై సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Updated Date - 2022-04-07T16:43:35+05:30 IST