హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఘనంగా ఆది పినిశెట్టి నిశ్చితార్థం

ABN , First Publish Date - 2022-03-26T21:13:01+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించే

హీరోయిన్ నిక్కీ గల్రానీతో ఘనంగా ఆది పినిశెట్టి నిశ్చితార్థం

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు ఆది పినిశెట్టి. ‘గుండెల్లో గోదారి’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ‘సరైనోడు’, ‘నిన్నుకోరి’, ‘రంగస్థలం’, ‘గుడ్‌లక్ సఖి’ వంటి చిత్రాలతో అభిమానులను అలరించాడు. టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  


ఆది పినిశెట్టి‌ నిశ్చితార్థం హీరోయిన్ నిక్కీ గల్రానీ‌తో మార్చి 24న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఆది పినిశెట్టి ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా జీవితంలో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే..  కొన్నేళ్ల క్రితం మేం ఒకరికీ, మరొకరం పరిచయం అయ్యాం. ఇరు కుటుంబాల సమక్షంలో మా నిశ్చితార్థం మార్చి 24న ఘనంగా జరిగింది. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అందుకు మీరందరూ ఆశీస్సులు, దీవెనలు అందించాలి’’ అని ఆది పినిశెట్టి ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. ‘యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులో ‘మలుపు’  పేరుతో విడుదలైంది. ఈ మూవీ చేస్తున్నప్పుడే నిక్కీకి, ఆదితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 





Updated Date - 2022-03-26T21:13:01+05:30 IST