గన్స్‌తో చిన్నప్పుడే పరిచయముంది

ABN , First Publish Date - 2022-09-26T06:34:21+05:30 IST

తన కెరీర్‌లో ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపించనుంది సోనాల్‌ చౌహాన్‌. నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘ది ఘోస్ట్‌’లో ఇంటర్‌ పోల్‌ ఆఫీసరుగా...

గన్స్‌తో చిన్నప్పుడే పరిచయముంది

తన కెరీర్‌లో ఇప్పటి వరకూ చేయని పాత్రలో కనిపించనుంది సోనాల్‌ చౌహాన్‌. నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘ది ఘోస్ట్‌’లో ఇంటర్‌ పోల్‌ ఆఫీసరుగా నటించింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 5న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ‘ది ఘోస్ట్‌’ విశేషాలను మీడియాతో పంచుకొంది సోనాల్‌. ‘‘ఇదో డ్రీమ్‌ రోల్‌ లాంటిది. ఇంత వరకూ ఇలాంటి  పాత్ర నేను చేయలేదు. ఇంటర్‌ పోల్‌ ఆఫీసరుగా నటించడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ  యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొన్నా. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకొన్నా. ఆ సమయంలో నా కాలుకి గాయం అయ్యింది. మా నాన్న పోలీస్‌ అధికారి. కాబట్టి.. గన్స్‌తో నాకు చిన్నప్పుడే పరిచయం. ఈ సినిమాలో నేను ఏకే 47 లాంటి ఆయుధాల్ని వాడాల్సివచ్చింది. బుల్లెట్స్‌ లోడ్‌ చేయడం, గన్‌ పట్టుకోవడం తదితర అంశాల్లోనూ శిక్షణ తీసుకొన్నా. ఈ ప్రయాణం.. చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలే చేశా. ఇలాంటి వైవిఽధ్యమైన పాత్రల్లోనూ మెప్పించగలనని ‘ది ఘోస్ట్‌’ నిరూపించింది. ఈ సినిమా ఫలితం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉంది. ప్రస్తుతం రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతా’’ అని చెప్పుకొచ్చింది. 


Updated Date - 2022-09-26T06:34:21+05:30 IST