Pushpa 3 కూడా ఉంది..? ఫహాద్ ఫాసిల్ ఏం చెప్పాడంటే..

ABN , First Publish Date - 2022-07-21T14:41:32+05:30 IST

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, యంగ్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘పుష్ప’. రెండు భాగాలు రానున్న..

Pushpa 3 కూడా ఉంది..? ఫహాద్ ఫాసిల్ ఏం చెప్పాడంటే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), యంగ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘పుష్ప (Pushpa)’. రెండు భాగాలు రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ ‘పుష్ప: ది రైజ్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో రోజుకో వార్త ఈ మూవీ గురించి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా పుష్ప 3 కూడా ఉన్నట్లు మరో న్యూస్ ఈ సినిమా గురించి వైరల్ అవుతోంది. 


‘పుష్ప’, ‘విక్రమ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘మలయంకుంజు’. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటుడు ఫహద్ ఫాసిల్ పుష్ప గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో ఈ సూపర్ హిట్ చిత్రానికి మూడో పార్ట్ ఉంటుందని తెలిపాడు.


అంతేకాకుండా.. మొదట ఈ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు పుష్ప సోలో మూవీ తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. కానీ పోలీస్ స్టేషన్‌లోని ఓ సన్నివేశం వల్ల అది రెండు భాగాలు తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అలా పుష్ప 2 తెరమీదకి వచ్చింది. దానికి గురించి ఫహాద్.. ‘సుకుమార్ నాతో మాట్లాడినప్పుడు పుష్ప 3కి కావాల్సినంత మెటీరియల్‌ తన దగ్గర ఉందని తెలిపారు. దానికి కూడా రెడీగా ఉండమని నన్ను కోరాడు’ అని కూడా చెప్పుకొచ్చాడు.


‘పుష్ప: ది రైజ్’.. డిసెంబర్ 17, 2021న విడుదలై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందాయి. ఈ చిత్రంతో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్‌కి దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగింది.

Updated Date - 2022-07-21T14:41:32+05:30 IST