RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మీకు తెలియని నిజాలివి..

ABN , First Publish Date - 2021-12-19T02:23:49+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాలతో ఎస్ ఎస్. రాజమౌళి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతడు తాజాగా

RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మీకు తెలియని నిజాలివి..

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి సినిమాలతో ఎస్ ఎస్. రాజమౌళి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అతడు తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం దేశంలోని పలు ప్రాంతాల మీడియాతో ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. 


తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ‌వెంట్‌ను ముంబైలో భారీ ఎత్తున ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ 19న జరగబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఫంక్షన్  జరగబోతుందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ఈవెంట్ కోసం దాదాపుగా రూ.10కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్టు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్టు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. 


ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా లైవ్ టెలికాస్ట్ అవుతోంది. సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో ఈ ఫంక్షన్‌ను లైవ్‌లో ప్రసారం చేయడం లేదు. వారం రోజుల అనంతరం టీవీలో ప్రసారం కాబోతున్నట్టు వినికిడి. ఈ చిత్రంలో తారక్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య దాదాపుగా రూ. 450కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు. 



Updated Date - 2021-12-19T02:23:49+05:30 IST