F3 వేదిక.. వినోదాల వేడుక!

ABN , First Publish Date - 2022-05-22T21:34:35+05:30 IST

వేసవిలో చల్లచల్లగా వినోదాన్ని అందించేందుకు సమ్మర్‌ సోగ్గాళ్లుగా రాబోతున్నారు వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌ తేజ్‌(Varun tej). వీరిద్దరూ కలిసి నటించిన ‘ఎఫ్‌3(F3)’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి Anil ravipudi దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయిలు.

F3 వేదిక.. వినోదాల వేడుక!

వేసవిలో చల్లచల్లగా వినోదాన్ని అందించేందుకు సమ్మర్‌ సోగ్గాళ్లుగా రాబోతున్నారు వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌ తేజ్‌(Varun tej). వీరిద్దరూ కలిసి నటించిన ‘ఎఫ్‌3(F3)’ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. అనిల్‌ రావిపూడి Anil ravipudi దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయిలు. సోనల్‌ చౌహన్‌ కీలక పాత్రధారి. పూజాహెగ్డే ప్రత్యేక గీతంలో అలరించనున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేదికపై సునీల్‌ మూకీ స్కిట్‌తో నవ్వులు పూయించారు. ‘ఎఫ్‌–2 వర్సెస్‌ ఎఫ్‌–3’ పేరుతో సాగిన సెగ్మెంట్‌లో వరుణ్‌తేజ్‌, వెంకటేశ్‌, ఆలీ, పృధ్వీ తదితరులు ఈ రెండు బృందాలుగా విడిపోయి నాన్‌స్టాప్‌గా వినోదాన్ని అందించారు. వెంకటేశ్‌ ‘ఇంద్ర’ చిత్రంలో చిరంజీవి డైలాగ్‌ చెప్పారు. వరుణ్‌తేజ్‌ ‘లక్ష్మీ నరసింహ’ చిత్రంలో బాలయ్య డైలాగ్‌లు చెప్పి అలరించారు. నాగార్జున, వెంకటేశ్‌.. సినిమాల్లోని డైలాగ్స్‌ కూడా చెప్పి ఆహుతుల్ని నవ్వులతో ఆకట్టుకున్నారు. నిర్మాత దిల్‌ రాజు నాగార్జునని అనుకరిస్తూ చేసిన రీల్‌, అనిల్‌ రావిపూడి గణేష్‌ డైలాగ్‌ చెప్పి అదరగొట్టారు. అలాగే వెంకటేష్‌ ‘ఎఫ్‌ 3’లో తను పోషించిన రేచీకటి పాత్రతో వేదికపై ఎంట్రీ ఇచ్చారు. కలర్‌ఫుల్‌గా సాగిన ఈ వేడుకను చూసినవారంతా ‘ఎఫ్‌ 3’ వేదిక.. వినోదాల వేడుక’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. టికెట్‌ రేట్లకు భయపడుతున్న ప్రేక్షకులు థియేటర్‌కు దూరమవుతున్న తరుణంలో ఈ చిత్రం సాధారణ టికెట్‌ రేట్లకే ప్రదర్శించబడునని దిల్‌ రాజు (Dil raju)ప్రకటించారు. 














Updated Date - 2022-05-22T21:34:35+05:30 IST