F3 : ముఖేష్ యాడ్ లేకుండానే విడుదల !

ABN , First Publish Date - 2022-05-22T21:06:32+05:30 IST

ఏ సినిమాకెళ్ళినా ప్రేక్షకులకు ముఖేశ్ యాడ్ తప్పట్లేదు. ధూమపానం, మధ్యపానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి కాబట్టి... ఆ యాడ్ సినిమాల్లో ప్రదర్శించడం తప్పనిసరిగా మారింది. సినిమాల్లో సిగరెట్ తాగడం, మందుకొట్టం కామన్‌గా ఉంటున్నాయి కాబట్టి.. ప్రజల్ని ఇలాంటి యాడ్స్‌తో మేల్కొల్పాల్సిందే. అయితే ‘ఎఫ్ 3’ (F3) చిత్రం టైటిల్స్ కు ముందు ఈ గోల ఉండనే ఉండదని తెలుస్తోంది.

F3 : ముఖేష్ యాడ్ లేకుండానే విడుదల !

ఏ సినిమాకెళ్ళినా ప్రేక్షకులకు ముఖేశ్ యాడ్ తప్పట్లేదు. ధూమపానం, మధ్యపానంపై ప్రజలకు అవగాహన కల్పించాలి కాబట్టి... ఆ యాడ్ సినిమాల్లో ప్రదర్శించడం తప్పనిసరిగా మారింది. సినిమాల్లో సిగరెట్ తాగడం, మధ్యం తాగడం కామన్‌గా ఉంటున్నాయి కాబట్టి.. ప్రజల్ని ఇలాంటి యాడ్స్‌తో మేల్కొల్పాల్సిందే. అయితే ‘ఎఫ్ 3’ (F3) చిత్రం టైటిల్స్ కు ముందు ఈ గోల ఉండనే ఉండదని తెలుస్తోంది. ఇందులో ముఖేష్ యాడ్ కనిపించదు. కారణం ఈ సినిమాను వీలైనంత క్లీన్‌గా తెరకెక్కించాలన్న ఉద్దేశంతో నిర్మాత దిల్ రాజు ( Dil Raju) ధూమపానం, మధ్యపానం సీన్స్‌ను పెట్టలేదట. అందుకే ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేశారు. ప్రేక్షకుల్ని కుటుంబ సమేతంగా ‘ఎఫ్ 3’ చిత్రానికి రప్పించాలని, కంకణం కట్టుకొన్న దిల్ రాజు.. అలాంటి సీన్స్ ను ఈ సినిమాలో చిత్రీకరించవద్దని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కి స్ట్రిక్స్ట్‌గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారట. ఆయన సూచనల మేరకే ఈ మూవీని క్లీన్ ఎంటర్ టైనర్‌గా తీర్చిదిద్దారట. సినిమాలో ఎక్కడా కూడా మధ్యం, ధూమపానం సేవించే సన్నివేశాలు కనిపించవట. మిగతా మేకర్స్ కూడా దీన్ని ఫాలో అయితే.. బాగుంటుందేమో. 


‘ఎఫ్ 2’ (F2) చిత్రం ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లోకెల్లా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అందుకే దీనికి మించిన స్థాయిలో ‘ఎఫ్ 3’ చిత్రాన్ని హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) చాలా కష్టపడ్డాడు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఈ సినిమా నాన్‌స్టాప్ గా నవ్విస్తునే ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.  వెంకీ (Venky)  కామెడీ టైమింగ్, వరుణ్ తేజ్ (Varun Tej)  తెలంగాణ స్లాంగ్, తమన్నా (Tamanna),  మెహ్రీన్ (Mehreen) గ్లామర్ ..  ఈ సినిమాకి అదనపు ఆకర్షణ కానున్నాయి. అలాగే హీరోలకున్న ఉన్న బలహీనతలు కూడా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ‘ ట్రైలర్ కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందే తెలిసిందే. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-05-22T21:06:32+05:30 IST