F3: ‘ఎనీ సెంటర్.. సింగిల్ టాక్.. బ్లాక్‌బస్టర్’

Twitter IconWatsapp IconFacebook Icon

‘‘ఎఫ్ 3 (F3) చిత్రాన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు ఎఫ్3 చిత్ర యూనిట్. విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi), స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు (Dil Raju)  కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై.. దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ (Shirish)  నిర్మించిన ఈ చిత్రం.. శుక్రవారం (మే 27) ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై.. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘‘ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్‌బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్‌కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజుగారు, అనిల్ రావిపూడి.. మేము అంతా కలసి ఫ్యామిలీస్‌ని థియేటర్‌కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్‌కి వెళ్లి చూసిన చిత్రమిదే. థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3 చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘ఎఫ్ 3కి యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 చూసిన ప్రేక్షకులు సూపర్, ఎక్సట్రార్డినరీ, అదిరిపోయిందిగా..! అంటున్నారు. ఎక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్‌ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.

F3: ఎనీ సెంటర్.. సింగిల్ టాక్.. బ్లాక్‌బస్టర్

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,..  అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.


దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి ‘ఎనీ సెంటర్ సింగిల్ టాక్ బ్లాక్ బస్టర్’ అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షలులు థియేటర్‌లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు గారు, శిరీష్ గారితో ఇది నాకు ఐదో సినిమా. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్‌గారికి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్  ఇమేజ్ వుండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో  వెంకటేష్ గారి స్పెషల్ థ్యాంక్స్. ఎఫ్ 3ని మరో లెవల్‌కి తీసుకెళ్ళినందుకు ఆనందంగా వుంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు.  ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.