F3: ‘ఎఫ్‌3’ నవ్వుల విలువ 100 కోట్లు!

ABN , First Publish Date - 2022-06-05T22:36:26+05:30 IST

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ‘ఎఫ్‌3’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుని దూసుకుపోతోంది. తొమ్మిది రోజుల్లో వంద కోట్ల రూపాయిలు గ్రాస్‌ వసూలు చేసి ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’ బృందం ఫుల్‌ సెలబ్రేషన్స్‌లో ఉంది. ఇందులో భాగంగా శనివా ట్రిపుల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఫన్‌’టాస్టిక్‌ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు.

F3: ‘ఎఫ్‌3’ నవ్వుల విలువ 100 కోట్లు!

వెంకటేష్‌(Venkatesh), వరుణ్‌ తేజ్‌ (Varuntej) హీరోలుగా అనిల్‌ రావిపూడి (Anil ravipudi)దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన ‘ఎఫ్‌3’ (F3)చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుని దూసుకుపోతోంది. తొమ్మిది రోజుల్లో వంద కోట్ల రూపాయిలు గ్రాస్‌ వసూలు చేసి ఇప్పటికీ  హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ప్రస్తుతం ‘ఎఫ్‌3’ బృందం ఫుల్‌ సెలబ్రేషన్స్‌లో ఉంది. ఇందులో భాగంగా శనివా ట్రిపుల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఫన్‌’టాస్టిక్‌ ఈవెంట్‌ను వైజాగ్‌లో నిర్వహించారు. (Dil raju)

వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘నా మొదటి సినిమా ‘కలియుగ పాండవులు’ వైజాగ్‌లో చేశాను. ‘స్వర్ణ కమలం’, ‘గోపాల గోపాల’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘మల్లీశ్వరి’, ‘గురు’ ఇలా చాలా చిత్రాల షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. అందుకే వైజాగ్‌ అంటే ప్రత్యేక అభిమానం. దిల్‌ రాజు మంచి స్ర్కిప్ట్‌తో వచ్చారు. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు. ‘నారప్ప’, ‘దృశ్యం’ ఓటీటీకి వెళ్ళడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. అందుకే ఎఫ్‌ 3లో నారప్ప గెటప్‌ లో వచ్చి ఫ్యాన్స్‌ని థ్రిల్‌ చేయాలనుకున్నా’’ అని అన్నారు. 


ప్రేక్షకుల ప్రశంసలే మాకు వందకోట్లు: వరుణ్‌తేజ్‌

‘‘200 మంది ఆర్టిస్ట్‌లతో రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి రెండున్నర గంటల సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. డబ్బులు, కలెక్షన్లు ఇవేమీ ఇవ్వని ప్రేక్షకులు సినిమా చూసి శభాష్‌ అంటే వస్తుంది. ప్రేక్షకుల ప్రశంసే మాకు వందకోట్లు. ఇంత మంచి సినిమా రావడానికి అనిల్‌ కారణం. ఆయనది యునీక్‌ స్టైల్‌. దానితోనే వరుసగా ఆర్లు హిట్లు కొట్టారు. అలాగే 36 హిట్లు కొట్టాలి. సెట్‌లో  వెంకటేష్‌ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఇకపై ఆయనతో సినిమా అంటే కథ కూడా వినకుండా ఓకే అనేస్తా’’ అని చెప్పారు. 




వందకోట్లతో తిరిగిచ్చారు: అనిల్‌ రావిపూడి

‘‘వైజాగ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నేను రాసే ప్రతి స్ర్కిప్ట్‌ ఇక్కడ నుంచే మొదలవుతుంది. ‘ఎఫ్‌3’ విడుదలైన తొమ్మిది రోజుల్లో వందకోట్లు క్రాస్‌ చేశాం. ఈ క్రెడిట్‌ ప్రేక్షకులకే దక్కుతుంది. ‘ఎఫ్‌2’ ఫ్రాంచైజీని కొనసాగించవచ్చనే ధైర్యాన్ని ‘ఎఫ్‌ 3’ విజయంతో ఇచ్చారు. నవ్వుకోవడానికే ఈ సినిమా తీశామని మొదటి నుంచి చెబుతున్నాం. ఈ రోజు ఆ నవ్వుల విలువ వందకోట్లతో తిరిగిచ్చారు ప్రేక్షకులు. ‘ఎఫ్‌ 2’ కంటే ‘ఎఫ్‌ 3’ ని ఎక్కువ ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘ఎఫ్‌ 4’ ప్రకటన కూడా త్వరలోనే వస్తుంది’’ అని అన్నారు. 


లాజికల్‌గా మ్యాజికల్‌గా చింపే సినిమా చేస్తాం: దిల్‌ రాజు

‘‘ఎఫ్‌3’ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇది తొమ్మిదో రోజు. వంద కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి సినిమా ముందుకు వెళుతుంది. కరోనా తర్వాత ఓ ఫ్యామిలీ సినిమా వందకోట్లు టచ్‌ చేయడం మాకు ఎంతో ప్రత్యేకం. జగదాంబలో 11 వందల సీట్లు ఫుల్‌ కావడం మామూలు విషయం కాదు. ‘ఎఫ్‌4’ని ఎలా చేయాలనే టెన్షన్‌ అనిల్‌కు ఇప్పటి నుంచే పట్టుకుంది. లాజికల్‌గా మ్యాజికల్‌గా చింపే సినిమా చేద్దాం. అదే మన గోల్‌. ‘ఎఫ్‌ 4’ కోసం వెయిట్‌ చేస్తుండండి’’ అని అన్నారు. (F3 success celebrations)


Updated Date - 2022-06-05T22:36:26+05:30 IST