F3: పూజా హెగ్డే ఫుల్ సాంగ్ వచ్చేసింది

ABN , First Publish Date - 2022-05-18T01:00:04+05:30 IST

ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ (F3) మూవీలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం.. ఈ నెల 27 థియేటర్లలో

F3: పూజా హెగ్డే ఫుల్ సాంగ్ వచ్చేసింది

ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’ (F3) మూవీలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) చేసిన స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం.. ఈ నెల 27 థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ఈ చిత్రాన్ని  నిర్మాత దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ (Sirish) నిర్మించారు. ఈ సినిమాకి మరింత గ్లామర్ జోడించింది ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌’గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్టా వుండాలా’ (Life ante itta vundalaa) సాంగ్. పూజా హెగ్డే స్పెషల్ అప్పీరియన్స్‪లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట ప్రస్తుతం టాప్‪లో ట్రెండ్ అవుతోంది.


రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Rock Star Devi Sri Prasad) ఈ పాట కోసం క్యాచి డ్యాన్సింగ్ ట్యూన్‪ని కంపోజ్ చేశారు. దేవిశ్రీ తనదైన శైలిలో స్వరపరిచిన ఈ పార్టీ సాంగ్‪ని.. పూజా హెగ్డే తన డ్యాన్స్ మూమెంట్స్‪తో నెక్స్ట్ లెవెల్‪కి తీసుకెళ్లింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో తమ గ్రేస్‪తో అదిరిపోయే మూమెంట్స్ చేశారు. నాగినీ మ్యూజిక్‪కి పూజా, వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన స్నేక్ డ్యాన్స్ మాస్‪ని అలరించేలా వుంది. సాంగ్‪లో సునీల్ (Sunil), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)‪ల ఎంట్రీ కూడా ఉంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) సాహిత్యం అందించారు. మనిషి పెద్ద కలలు కనాలి, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం ఈ పాటలో వుంది. పూజా హెగ్డే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్‪గా వచ్చిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), గీతా మాధురి (Geetha Madhuri)  ఫుల్ ఎనర్జీ‪తో ఆలపించారు. కాగా, ఈ చిత్రంలో తమన్నా భాటియా (Tamannaah Bhatia), మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada), సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) కథానాయికలుగా నటించిన ఈ చిత్రం.. టాలీవుడ్‪కి చెందిన భారీ తారాగణంతో తెరకెక్కింది.



Updated Date - 2022-05-18T01:00:04+05:30 IST