Editor Tammiraju: ‘F3’ సూపర్ హిట్ పక్కా!

ABN , First Publish Date - 2022-05-04T02:45:04+05:30 IST

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), తమన్నా (Tamannah), మెహ్రీన్(Mehreen), అనిల్ రావిపూడి (Anil Ravipudi), దిల్ రాజు

Editor Tammiraju: ‘F3’ సూపర్ హిట్ పక్కా!

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), తమన్నా (Tamannah), మెహ్రీన్(Mehreen), అనిల్ రావిపూడి (Anil Ravipudi), దిల్ రాజు (Dil Raju) వంటి కాంబినేషన్‪లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ఎఫ్ 3’ (F3). బ్లాక్ బస్టర్ ‘F2’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‪పై శిరీష్ (Sirish) నిర్మించారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమౌతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ యమా జోరుగా నిర్వహిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి పని చేసిన స్టార్ ఎడిటర్ తమ్మిరాజు (Editor Tammiraju) ‘ఎఫ్ 3’ చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. 


మీ సినీ ప్రయాణం గురించి..?

నేను పరిశ్రమలోకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. 1998లో రామోజీ ఫిల్మ్ సిటీలో(RFC) నా కెరీర్ మొదలైంది. తర్వాత  ప్రసాద్ ల్యాబ్‪లో(Prasad Lab) 14ఏళ్ల పాటు ఆవిడ్ ఎడిటర్‪గా చేశాను. దర్శకుడు రాజమౌళి (Rajamouli)గారితో 18 ఏళ్ళు ప్రయాణం చేశాను. శాంతి నివాసం సీరియల్ నుంచి బాహుబలి 2 వరకూ రాజమౌళిగారితో పని చేశాను. దర్శకుడు అనిల్ రావిపూడిగారితో ‘పటాస్’ (Pataas) నా ఫస్ట్ చిత్రం. తర్వాత ఆయన సినిమాలన్నీ చేశాను.  ఇప్పటివరకూ దాదాపు 30సినిమాలకు ఎడిటర్‪గా చేశాను.


‘ఎఫ్ 2’కి, ‘ఎఫ్ 3’కి టెక్నాలజీ పరంగా ఏమైనా మార్పులు వచ్చాయా?

అదే టెక్నాలజీ. అయితే ప్రేక్షకుడు సినిమాని చూసే విధానం మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఎడిటింగ్ ఉండాలి.


‘ఎఫ్ 2’తో పోలిస్తే ‘ఎఫ్ 3’ కథ ఎలా ఉండబోతుంది?

‘ఎఫ్ 2’లో పెళ్లి, తర్వాత వచ్చే కష్టాలు.. ఇలా వినోదాత్మకంగా చూపించాం. ‘ఎఫ్ 3’ డబ్బు చుట్టూ తిరిగే కథ. మానవసంబంధాలు డబ్బుతో ముడిపడి వున్నాయి. ఈ పాయింట్  ఎఫ్ 3లో చాలా ఫన్ ఫుల్‪గా చూపించడం జరిగింది.


ఎఫ్ 2 కి ఎఫ్ 3 పోలికలు వస్తాయా?

ఎఫ్ 2 ఫ్రాంచైజ్‪గా వస్తున్న సినిమా ఎఫ్ 3. ఆ సినిమాలోని క్యారెక్టర్లు ఉంటాయి కానీ ఎఫ్ 3 కథ మాత్రం పూర్తిగా భిన్నం. లీడ్ క్యారెక్టర్లు తీసుకొని కథని కొత్తగా చెప్పాం.


కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం ఎలా వుంటుంది?

కామెడీ సినిమాలని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా అనిల్ రావిపూడిగారి సినిమాల్లో అన్నీ కామెడీ పంచులు బావుంటాయి. దానిలో ఏది ట్రిమ్ చేయలన్నా కష్టంగా వుంటుంది. అయితే ఓవరాల్ ఫ్లో చూసుకొని కథకు ఏది అవసరమో అదే ఉంచుతాం.  


దర్శకుడు అనిల్ రావిపూడితో వర్క్ ఎలా వుంటుంది?

అనిల్ రావిపూడిగారితో వర్క్ చేయడం చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడూ ప్రేక్షకుల పక్షమే ఆలోచిస్తుంటారు. పటాస్ సినిమా నుంచి మా మధ్య అద్భుతమైన సింక్ కుదిరింది.


ఎడిటర్ అభిప్రాయాన్ని దర్శకులు గౌరవిస్తారా?

ఎడిటింగ్ టేబుల్ దగ్గర చాలా చర్చలు, అర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ప్రీ ప్రొడక్షన్ ఎంత చక్కగా చేస్తామో పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కూడా అంతే జాగ్రత్తగా చేస్తే మంచి సినిమా వస్తుంది. రషెస్ మొదట ఎడిటర్ చూస్తాడు. ఎడిటర్ చెప్పే సూచనలని దర్శకులు గౌరవిస్తారు.


మొదటి ప్రేక్షకుడిగా ‘ఎఫ్ 3’ ఎలా అనిపించింది?

ఎఫ్ 2 కంటే ఎఫ్ 3లో డబుల్ ఫన్. ఇందులో డబ్బు గురించి చెప్పే కొన్ని పాయింట్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులకు డబుల్ ఫన్ అందిస్తాయి.


నిర్మాత దిల్ రాజు సినిమా అంటే ఎడిటర్‪కి ఎక్కువ పని ఉంటుందని విన్నాం.. నిజమేనా?

దిల్ రాజు గారు అద్భుతమైన నిర్మాత. సినిమా అంటే ఆయనకి ప్రేమ. సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తారు. అయితే దిల్ రాజుగారి బ్యానర్‪లో దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్కువగా పని చేయడం కారణంగా.. అనిల్ గారే కరెక్షన్స్ చూసుకుంటారు.


పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఎడిటింగ్‪పై ఎలా వుంటుంది?

నేను బాహుబలి 2కి (Bahubali 2) చేశా. రాజమౌళి‪గారు క్రెడిట్ ఇచ్చారు. అన్ని భాషలు తెలిసిన ఎడిటర్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తారు.


రీషూట్స్ విషయంలో ఎడిటర్ పాత్ర ఎలా వుంటుంది?

దర్శకుడు, నిర్మాత, ఎడిటర్ .. అందరూ కూర్చుని చర్చించిన తర్వాత ఏది అవసరమో, కాదో నిర్ణయం తీసుకుంటారు.


కథ వింటారా?

నేను కథ వినను. కథ వింటే ఇలా వుంటుందని ఫిక్స్ అయిపోతాం. రష్ లో అది లేకపోతే ఇలా ఎందుకైయిందనే ప్రశ్న తలెత్తుతుంది. నా వరకూ రష్ ప్రకారం ఎడిటింగ్ చేస్తా.  


ఎడిటింగ్‪కి, సిజీకి ఎలాంటి సంబంధం వుంటుంది?

చాలా వుంది. బ్లూ మ్యాట్స్ ఎక్కువగా తీసుకున్నారు. అక్కడ ఏం వుంటుందో తెలీదు. దానిని దృష్టిలో పెట్టుకుని మనం ఎడిట్ చేసుకోవాలి. కొన్ని సార్లు అనుకున్న విజన్ రాకపోవచ్చు. మళ్ళీ చర్చించి వర్క్ చేయాల్సివుంటుంది.


ఇన్నాళ్ళ కెరీర్‪లో కష్టమనిపించిన సినిమా?

‘మిర్చి’(Mirchi)కి అసోషియేట్ ఎడిటర్‪గా చేసినప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశాను. పటాస్ సినిమాకి కూడా చాలా కష్టపడ్డాం.


రష్ చూశాక ‘ఎఫ్ 3’ఎలా అనిపించింది?

సూపర్ హిట్. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు .. మిగతా నటీనటులంతా చాలా వండర్ ఫుల్ గా చేశారు. ఎఫ్ 3 ఫన్ రైడ్ నెక్స్ట్ లెవల్‪లో వుంటుంది.


సినిమా విజయం అయినప్పుడు మిగతా వారితో పోల్చుకుంటే ఎడిటర్‪కి తక్కువ క్రెడిట్ వస్తుంది కదా?

సినిమా సక్సెస్ దర్శకుడిదే. దర్శకుడి విజన్‪తోనే ఎడిటర్ పని చేయాలి. అతను తీసిన రష్ ని ఎడిట్ చేయాలి. కాబట్టి సక్సెస్ క్రెడిట్ దర్శకుడికే చెందాలి. అయితే మాకు రావాల్సిన గురింపు కూడా వస్తుంది.


మీతోటి ఎడిటర్స్ రిలేషన్ ఎలా వుంటుంది?

సినిమా విడుదలైన తర్వాత బావుందని ఫోన్ చేసి మాట్లాడతారు. ఎడిటర్స్ మధ్య మంచి వాతావరణం వుంది.


లీకేజీలు గురించి ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారు?

సినిమా వర్క్ జరుగుతున్నపుడు పుటేజ్ చాలా చోట్లకి వెళుతుంది. అయితే పని చేసే వాళ్ళకి లీక్ చేయడం తప్పు అనే సంస్కారం వుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్వయం నియంత్రణ వుంటేనే లీకేజీలని ఆపగలం.  


ఎఫ్ 3 గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?

ఎఫ్ 2కి మించి డబుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ హిట్ పక్కా.


ఎఫ్ 4 (F4) కూడా వుంటుందా?

ఇంకా అనుకోలేదు. అయితే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది.  


తదుపరి చేస్తున్న కొత్త సినిమాలు?

కళ్యాణ్ రామ్ (Kalyan Ram)‪గారితో బింబిసార (Bimbisara), మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సినిమా, నాగశౌర్య (Naga Shourya) కృష్ణ వ్రింద విహారి (Krishna Vrinda Vihari) సినిమాలు చేస్తున్నాను.

Updated Date - 2022-05-04T02:45:04+05:30 IST