మీకు వంద ముద్దులు, వంద హగ్గులు అన్నారు

ABN , First Publish Date - 2022-05-21T05:30:00+05:30 IST

‘‘ఎఫ్‌ 3’ రీరికార్డింగ్‌ పూర్తయ్యాక అనిల్‌ రావిపూడి ఫోన్‌ చేశారు. ‘ఎమోషనల్‌ సీన్లలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఎక్సట్రార్డీనరీగా ఉంది.

మీకు వంద ముద్దులు, వంద హగ్గులు అన్నారు

‘‘ఎఫ్‌ 3’ రీరికార్డింగ్‌ పూర్తయ్యాక అనిల్‌ రావిపూడి ఫోన్‌ చేశారు. ‘ఎమోషనల్‌ సీన్లలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఎక్సట్రార్డీనరీగా ఉంది. మీకు వంద ముద్దులు, వంద హగ్గులు’ అన్నారు. బయట నుంచి ఎన్ని ప్రశంసలు వచ్చినా, సినిమా తీసిన దర్శకుడు మన పనితో సంతృప్తి పడడం నాకు మంచి కిక్‌ ఇస్తుంది’’ అని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ అన్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ఆయన సంగీతం అందించారు. ఈ నెల 27న విడుదలవుతున్న సందర్భంగా సినిమా విశేషాలను పంచుకున్నారు. 


ఎఫ్‌ 2కు పదింతల ఫన్‌ ఉంటుంది. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. నవ్విస్తాను అని కంకణం కట్టుకొని రాసినట్టున్నారు అనిల్‌ రావిపూడి గారు ఈ స్ర్కిప్ట్‌. ఇది కామెడీ చిత్రం కాదు. గొప్ప సందేశం ఉంది. 


అనిల్‌ రావిపూడి ప్రతిభావంతుడైౖన దర్శకుడే కాదు గొప్ప నటుడు కూడా. అనిల్‌ కథ చెప్పేటప్పుడు డైలాగ్స్‌ చెబుతూ, యాక్షన్‌ చేస్తూ, మనకు సీన్‌ వివరిస్తారు. ఆయన చెబుతుంటే సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. దీనివల్ల నాకు సినిమా మీద సంపూర్ణ అవగాహన వ చ్చింది. 


మిగిలిన విభాగాల్లానే సంగీతంలోనూ మార్పు సహజం. ఎప్పటికప్పుడు అందులోనూ కొంత కొత్తదనం చేరుతుంది. మ్యూజిక్‌ అనేది ఒక ఫీలింగ్‌, ఎక్స్‌ప్రెషన్‌, ఎమోషన్‌. అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు. సినిమాని, డైరెక్టర్‌ చెప్పేది అర్థం చేసుకొని అందులోని పాత్రలకు ఏది సూటవుతుందో తెలుసుకొని, వాటిన్నింటినీ మేళవించి మనదైన ముద్రతో అందించాలి. 


ఒకరకంగా ఐటమ్‌సాంగ్స్‌ చేయడం కష్టమే. ఎందుకంటే మెలోడీ సాంగ్‌ చేయడానికి కథ పరంగా కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. కానీ ఐటమ్‌సాంగ్స్‌  లక్ష్యం చాలావరకూ ప్రేక్షకుణ్ణి ఎంటర్టైన్‌ చేయడమే. కథ పరంగా వాటికి పెద్ద ప్రాధాన్యం ఉండదు. అందుకే ఐటమ్‌సాంగ్‌ అంటే ఇలాగే ఉండాలనే పరిమితులు లేవు.

Updated Date - 2022-05-21T05:30:00+05:30 IST