F 3: ట్విటర్ రివ్యూ

ABN , First Publish Date - 2022-05-27T15:19:46+05:30 IST

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఎఫ్‌ 3 (F 3).

F 3: ట్విటర్ రివ్యూ

విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), వరుణ్‌తేజ్‌ (Varun Tej) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఎఫ్‌ 3 (F 3). తమన్నా (Tamannah), మెహ్రీన్ (Mehreen) హీరోయిన్స్‌గా సోనాల్ చౌహాన్ (Sonal Chouhan), సునీల్ (Sunil) తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 (F 2) చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎఫ్ 2 భారీ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు రిలీజైన ఎఫ్ 3 మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.


ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడ్డాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. మరి ఎఫ్ 3 కథేంటీ.. కథనం ఎలా ఉంది? వంటి అంశాలను ట్విటర్‌ వేదికగా నెటిజన్స్ చర్చిస్తున్నారు. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా లేదా ఓ సారి ట్విటర్ రివ్యూలో చూద్దాం.   




ఎఫ్‌3 మూవీ చాలా బాగుంది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ల కామెడీ అదిరిపోయింది. లాజిక్‌ని పక్కన పెట్టి చూస్తే ఎఫ్‌3 ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. అని ఓ నెటిజన్‌ ట్వీట్ చేశాడు.  





ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది. కొన్ని కామెడీ సీన్స్‌ తప్ప..మిగతా సినిమా అంతా బోరింగ్‌గా ఉంది. ప్రొడక్షన్స్‌ వ్యాల్యూస్‌ బాలేవు. అని మరో నెటిజన్స్ తన అభిప్రాయాన్ని చెప్పాడు.  





ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉంది. మొదటి 15 నిమిషాలు సాగదీసినట్టు అనిపిస్తుంది. కామెడీ ఓకే. సెకండాఫ్‌లో  కామెడీ అదరిపోయింది. మూవీ చాలా బాగుంది.. అని నెటిజన్ తన రివ్యూ చెప్పాడు. 





Updated Date - 2022-05-27T15:19:46+05:30 IST