6 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళు పైబడిన వారు చూసే సినిమా ఇదట

ABN , First Publish Date - 2020-12-02T01:49:20+05:30 IST

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం పై సుశాంత్, చాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి ముఖ్య తారాగణంగా.. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో

6 ఏళ్ళ వయసు నుంచి 60 ఏళ్ళు పైబడిన వారు చూసే సినిమా ఇదట

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు సమర్పణలో సూచిత డ్రీం వర్క్స్ ప్రొడక్షన్ పతాకం పై సుశాంత్, చాందిని చౌదరి మరియు సిమ్రాన్ చౌదరి ముఖ్య తారాగణంగా.. రాఘవేంద్ర వర్మ దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్ కార్ నిర్మిస్తున్న రోబోటిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'బొంభాట్'. ఈ చిత్రం డిసెంబర్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో సుశాంత్‌ రెడ్డి, హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదరి, దర్శకుడు రాఘవేంద్ర వర్మతో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ..


సినిమా విడుదలకు సిద్ధమైంది.. ఎలాంటి ఫీలింగ్‌ ఉంది? 

సుశాంత్‌ రెడ్డి- విడుదల కోసం ఎంతగానో వెయిట్‌ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు డిసెంబర్‌ 3 వస్తుందా అని వేచి చూస్తున్నాను. అమెజాన్‌ ఓటీటీలో సింగిల్‌ టికెట్‌తో ప్రపంచంలోని అంతా చూస్తారు కాబట్టి.. రియాక్షన్‌, రివ్యూస్‌ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయ్‌. అందుకే మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నాను.


రాఘవేంద్రవర్మ- నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. కళ్లు మూసుకుంటే చాలు.. మా సినిమా విడుదల అయినట్లే అనిపిస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో వస్తుంది కాబట్టి.. ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది. అందుకే చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నా. 


సిమ్రాన్‌ చౌదరి- అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అవుతున్నందుఉ చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. 200కు పైగా దేశాలలో ఒకేసారి విడుదల అవుతుంది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. రిజల్ట్ కోసం వెయిట్‌ చేస్తున్నాం.


మీ తొలి చిత్రం 'ఈ నగరానికి ఏమైంది' థియేట్రికల్‌గానూ, డిజిటల్‌గానూ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓన్లీ డిజిటల్‌లో విడుదల అవుతుంది.. ఎలా అనిపిస్తుంది మీకు?

సుశాంత్‌ రెడ్డి- ప్రపంచంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే సినిమా విడుదల విషయంలో కొంచెం కన్ఫ్యూజ్‌ నెలకొన్న నేపథ్యంలో.. అమెజాన్‌ ద్వారా ఈ చిత్రం విడుదల అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ అనేది చాలా బిగ్‌ ప్లాట్‌ఫామ్‌. 200కి పైగా దేశాల్లో సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. నూతన నటీనటుల చిత్రాలు థియేటర్స్ ద్వారా అయితే.. అందరికీ రీచ్‌ అవ్వడం చాలా కష్టం. అమెజాన్‌లో విడుదల వల్ల సినిమా అందరికీ రీచ్‌ అవుతుంది. తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా.. డిసెంబర్‌ 3న ఈ సినిమా చూడవచ్చు. ఒక బ్రాండ్‌గా మారిన అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా విడుదల అవుతున్నందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను.


సుశాంత్‌ రెడ్డితో మీరు అల్రెడీ 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో నటించారు. ఇప్పుడు మరోసారి నటించారు.. ఎలా ఉంది ఆయనతో వర్కింగ్‌..?

సిమ్రాన్‌ చౌదరి- సుశాంత్‌గారితో 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంలో పనిచేశాను. కానీ అతనితో కొన్ని సీన్లు మాత్రమే ఆ చిత్రంలో ఉన్నాయి. ఈ చిత్రంలో మా ఇద్దరి కాంబినేషన్‌లో చాలా సీన్లు ఉన్నాయి. అతను నాకు మంచి స్నేహితుడు. ప్రొఫెషనల్‌ యాక్టర్‌. వర్క్‌షాప్స్‌ కూడా కలిసి చేశాం. అతనితో వర్క్‌ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అతనితో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. మా ఇద్దరి కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో చాలా బాగా కుదిరింది.


ఈ సినిమాలో 'చుప్పనాతి' మీరేనా?

సిమ్రాన్‌ చౌదరి- సాంగ్‌ చాందినీ చౌదరిగారిది.. కానీ.. ఆమె నన్ను ఉద్దేశించే పాడుకుంటుంది.


ఈ సినిమా ఎలా మొదలైంది? లీడ్‌ క్యాస్ట్‌ను ఎలా సెలక్ట్ చేసుకున్నారు?

రాఘవేంద్ర వర్మ- మంచి అవకాశం కోసం చూస్తూ.. మా నిర్మాత విశ్వాస్ హన్నూర్ కార్‌ గారికి కథ చెప్పాను. ఆయన నా కథని నమ్మారు. అలాగే గురువుగారు రాఘవేంద్రరావుగారు మమ్మల్ని వెనుకుండి నడిపించారు. సినిమా అలా మొదలైంది. ఇక లీడ్‌ క్యాస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ కలిసి, కథ చెప్పి.. వారికి నచ్చడంతో వారంతా సినిమాలో భాగమయ్యారు. ఈ విషయంలో నేను సుశాంత్‌గారికి థ్యాంక్స్‌ చెప్పాలి. కథ వినగానే ఆయన సినిమా చేస్తాను అని చెప్పారు. అలాగే సిమ్రన్‌, చాందినిగారు కూడా వారి పాత్రల గురించి చెప్పగానే.. చాలా కొత్తగా ఉందని చేస్తామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. 


'బొంభాట్‌' అని టైటిల్‌ పెట్టారు.. హాలీవుడ్‌ టైటిల్‌లా అనిపిస్తుంది.. అసలు 'బొంభాట్‌' అంటే ఏమిటి?

రాఘవేంద్రవర్మ- తెలంగాణ రాష్ట్రంలోని లోకల్‌ లాంగ్వేజ్‌.. అంటే కొన్ని రూరల్‌ విలేజ్‌లలోకి వెళితే.. ఏదైనా అదిరిపోయింది అని చెప్పడానికి మారు పదంగా 'బొంభాట్‌' అని వాడతారు. ఇది ఉర్దూ, హిందీ, తెలుగు మిక్స్‌ అయినట్లుగా తెలంగాణ లాంగ్వేజ్‌ ఉంటుంది. ఇందులో ఒక సూపర్‌ హీరో ఎలిమెంట్‌ ఉంది.. అందుకే ఆ పేరు కరెక్ట్‌గా సూట్‌ అవుతుందని పెట్టాం. 


ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

సుశాంత్‌ రెడ్డి- నేను ఈ సినిమాలో కాలేజ్‌ స్టూడెంట్‌గా కనిపిస్తాను. బ్యాడ్‌లక్‌ని ఎక్కువగా నమ్ముతుంటాను. ఒక ప్రొఫెసర్‌ వల్ల గుడ్‌ లక్‌, బ్యాడ్‌లక్‌లను సైన్స్‌ దృష్ట్యా కాస్త ఎక్కువ నమ్మాలని తెలుసుకుంటాను. ఒక రెగ్యులర్‌ కాలేజ్‌ స్టూడెంట్‌ లైఫ్‌లో.. కొన్ని సీరియస్‌ ప్రాబ్లమ్స్‌ చోటుచేసుకుంటాయి. చాలా నేర్చుకున్నాను ఈ సినిమాతో. డైరెక్టర్‌గారు.. ఎవరెవరు ఏ పాత్రలో నటిస్తే బాగుంటుందో.. అటువంటి వారిని సెలక్ట్ చేశారు. తనికెళ్ల భరణిగారు, మకరంద్‌ దేశ్‌పాండేగారు.. ఇలా సీనియర్‌ నటులు ఎందరో ఈ సినిమాలో పనిచేశారు. సెట్‌లో వారితో ఉండటం వల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాను. అందుకే సినిమా కోసం ఎంతగానో వెయిట్‌ చేస్తున్నాను. 


సైన్స్ ఫిక్షన్‌ మీకు కూడా ఫస్ట్ టైమ్‌.. ఎలా అనిపించింది?

సుశాంత్‌ రెడ్డి- రెగ్యులర్‌ సినిమాల్లా కాకుండా ఇటువంటి కొత్త తరహా చిత్రంలో చేసినందుకు హ్యాపీ. అలాగే మా డైరెక్టర్‌, నిర్మాత ఇటువంటి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ముందుకు రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైనా ఫస్ట్ రోమ్‌ కామ్‌ చేయాలని అనుకుంటారు. కానీ మా డైరెక్టర్‌గారు ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా చేశారు. నూతన నటీనటులతో ఇటువంటి సినిమాలు చేసేటప్పుడు బడ్జెట్‌ ప్రాబ్లమ్స్‌ వస్తుంటాయ్‌. వాటన్నింటిని అధిగమించి ఈ సినిమాని వారు రూపకల్పన చేశారు. అందుకే చాలా సంతోషంగా ఉంది. 


సిమ్రాన్‌ చౌదరి- నా పాత్ర ఈ సినిమాలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయ్‌.. ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. చాలా కొత్తగా ఉంటాయ్‌. రైటర్‌, దర్శకుడికి అందుకు థ్యాంక్స్‌ చెబుతున్నాను. చాలా కొత్తగా నా పాత్రను డిజైన్‌ చేశారు. రోబోటిక్‌తో.. నాకు కూడా చేయడానికి ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంతకంటే ఎక్కువ నా పాత్ర గురించి చెప్పలేను. సైన్స్‌ఫిక్షన్‌ గురించి.. అంటే.. నేను కూడా ఈ తరహా చిత్రం చేయడం ఇదే ఫస్ట్ టైమ్‌. చాలా నేర్చుకున్నాను. మానవరోబోగా, అలాగే నటిగా బ్యాలెన్సింగ్‌గా నటించే అవకాశం లభించింది. చాలా ఎమోషన్స్‌ ఉంటాయి నాకు. యాక్షన్‌ పార్ట్ గానీ, ఇతర ఎమోషన్స్‌ కోసం వర్క్‌ షాప్‌ చేసేటప్పుడే నాకు చాలా మంచి పాత్ర చేస్తున్నానని అనిపించింది. బుజ్జి లాంటి వారు కొందరు నాకు ఎంతో సపోర్ట్ చేశారు.


మీరు అనుకున్న విధంగా మీ క్యాస్ట్ నటించారా? 

రాఘవేంద్రవర్మ- 100 పర్సెంట్‌.. అందులో నో డౌట్‌. మనం 100 పర్సెంట్‌ నమ్మితేనే.. దానిని 70 నుంచి 80 వరకు న్యాయం చేయగలం. నేను నమ్మాను.. అందరూ డెడికేటెడ్‌గా వర్క్‌ చేశారు. అలాగే సాంకేతిక నిపుణులు కూడా ఎంతగానో సహకరించారు. అంత ఈజీగా తీసుకునే ఫిల్మ్‌ మాత్రం కాదు. 


ఎమోషనల్‌ లవ్‌ స్టోరీస్‌ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్న టైమ్‌లో.. ఒక సైన్స్‌ ఫిక్షన్‌ లవ్‌ స్టోరీ.. ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్‌ అవుతుందని అనుకుంటున్నారు?

రాఘవేంద్రవర్మ- కరెక్టే.. ఎమోషనల్‌ లవ్‌స్టోరీస్‌లో నుంచి పాత్‌ బ్రేకింగ్‌ వస్తేనే కొత్తదనం వస్తుంది. ఇది 100లో ఒక చిత్రం అని కాకుండా సెపరేట్‌గా ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. 


సినిమా చూశారా? ఎలా అనిపించింది?

సుశాంత్‌ రెడ్డి- నేను చూశాను.. చాలా హ్యాపీగా అనిపించింది. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత నేను చేసిన రెండో చిత్రమిది. అందులోనూ లీడ్‌ రోల్‌. చాలా రోజులు తర్వాత తెరమీద చూసుకున్నాక.. చాలా ఆనందం కలిగింది. 


సైన్స్‌ఫిక్షన్‌ మూవీస్‌ అంటే.. కెమెరా, గ్రాఫిక్స్‌ వంటి వాటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

రాఘవేంద్రవర్మ- అవే కాదండి.. మ్యూజిక్‌కి కూడా పెద్ద పీట ఉంటుంది. మ్యూజిక్‌ విషయానికి వస్తే..ఎలక్ట్రానిక్‌ టోన్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ జోష్‌గారు చాలా వర్క్‌ చేశారు. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ అన్నీ ఆయన దగ్గరుండి చూసుకున్నారు. విడుదలైన పాటలకి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. డిఫరెంట్‌ డిఫరెంట్‌గా ఈ సినిమాలో నాలుగు సాంగ్స్‌ ఉంటాయి. ఆర్‌ఆర్‌ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇక ఆర్ట్ వర్క్‌ శ్రీకాంత్‌గారు.. చాలా బ్రిలియెంట్‌గా వర్క్‌ చేశారు. రోబో పార్ట్స్‌ కూడా ఈజీగా తీసుకోలేదు.. చాలా హోమ్‌ వర్క్‌ చేశారు. ఇక కెమెరా సతీష్‌.. చాలా హార్డ్ వర్కర్‌. అన్నీ చాలా అందంగా చూపించారు. డైలాగ్స్‌ కూడా ఒక మనిషితో మాట్లాడేటప్పుడు, అలాగే ఒక మిషన్‌తో మాట్లాడేటప్పుడు వేరియేషన్స్‌ చూపిస్తూ.. చాలా అద్భుతంగా రాశాడు మా రైటర్‌ అక్షయ్‌. గ్రాఫిక్స్‌ అవుట్‌ స్టాండింగ్‌ అని చెప్పను కానీ.. సినిమాకి ఏ పరిధిమేర కావాలో ఆ పరిధిలో ఉంటాయి. ఏ విషయంలో కూడా ప్రేక్షకుడిని డిజప్పాయింట్‌ చేయదీ చిత్రం. ఓవరాల్‌గా ఒక మంచి టీమ్‌ వర్క్‌ ఈ సినిమాకి కుదిరింది. అందుకే అంత మంచి అవుట్‌పుట్‌ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందుకే అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 


అల్రెడీ ప్రివ్యూస్‌ జరిగి ఉంటాయి.. ఎటువంటి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది?

రాఘవేంద్రవర్మ- ప్రివ్యూ చూసిన తర్వాత వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో చాలా హ్యాపీ. ముఖ్యంగా ఫస్ట్ ఫిల్మ్‌ డైరెక్ట్ చేసినట్లుగా లేదు.. అని చాలా పెద్ద సెలబ్రిటీల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. ఇది చిన్న సినిమా కాదు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చూస్తుంటే చాలా పెద్ద సినిమా అనిపిస్తుందని వారు అభినందనలు తెలుపుతుంటే.. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. కొందరైతే.. హీరోయిన్స్‌ని గురువుగారు రాఘవేంద్రరావుగారిలా చూపించావని అన్నారు.. అయితే నేను ఇంకా అంత వరకు ఎదగలేదు అని అనుకుంటున్నాను. కానీ అది చాలా ఆనందంగా అనిపించింది. 


సినిమాలో చాందినీ చౌదరికి కాస్త గ్లామర్‌ టచ్‌ ఎక్కువ ఇచ్చినట్లు ఉన్నారు?

రాఘవేంద్రవర్మ- ఇప్పటి వరకు చాందినీ చేసిన సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంటుంది. గ్లామర్‌ అనేది బెంచ్‌ మార్క్‌. సబ్జెక్ట్ డిమాండ్‌ చేయడంతో పాటు.. చాందినీ కూడా గ్లామర్‌గా కనిపించింది.


ఫైనల్‌గా.. ఈ సినిమా గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు? ఎందుకు ఈ సినిమా చూడాలి?

సిమ్రాన్‌ చౌదరి- డిసెంబర్‌ 3న ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలవుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. అందరికీ నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. దయచేసి అందరూ ఈ సినిమాని అమెజాన్‌ ప్రైమ్‌లో చూడండి. 


సుశాంత్‌ రెడ్డి- ఇది కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌. చిన్న పిల్లల నుంచి ఏజ్‌ పర్సన్స్‌ వరకు అందరూ చక్కగా కూర్చుని చూసే చిత్రం. ఈ మధ్య షోస్‌ కొన్ని.. పిల్లలను దూరంగా పెట్టేసి, లేదా అమ్మానాన్నల పక్కన కూర్చుని చూడలేని విధంగా వస్తున్నాయి. ఇది అలా ఉండదు. క్లీన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఒక న్యూ కాన్సెప్ట్‌తో వస్తున్నాం.. అందరూ ఎంజాయ్‌ చేస్తారు. చాలా రోజుల తర్వాత ఈ జోనర్‌లో సినిమా వస్తుంది. అందరూ చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు.


రాఘవేంద్రవర్మ- నేను గర్వంగా చెప్పే విషయం ఏమిటంటే.. సుశాంత్‌ గారు చెప్పినట్లు.. ఈ సినిమాని ఆరేళ్ల వయసున్న పిల్లల నుంచి 60 ఏళ్ళు దాటిన వృద్దులు కూడా చూడదగిన సినిమా. ఇలాంటి చిత్రం నా ఫస్ట్ ఫిల్మ్‌ అయినందుకు చాలా గర్వంగా ఉంది. అమెజాన్‌ ఈ ప్లాట్‌ఫామ్‌ ఇచ్చినందుకు థ్యాంక్స్‌. అందరూ చూసి ఆదరించండి. 

Updated Date - 2020-12-02T01:49:20+05:30 IST