భారతదేశంలో క్రికెట్ (Cricket) ఆటకి ఉన్న క్రేజ్ తెలిసిందే. క్రికెట్ లెజెండ్స్‌గా పేరుగాంచిన సచిన్, సెహ్వాగ్, గంగూలి, కపిల్ దేవ్ వంటి ఎందరో టాప్ స్టార్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా కపిల్ తర్వాత ఇండియాకి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ ఎంఎస్.ధోని (MS Dhoni)కి ఉన్న భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ స్టార్ ఆటగాడు క్రికెట్‌తోనే కాకుండా పలువురు సినీ తారలతో లవ్ ఎఫైర్స్ నడిపి సైతం పలుమార్లు వార్తల్లో నిలిచాడు. ఈ రోజు (జులై 7)న ధోని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ప్రేమాయణాలు నడిపిన తారల గురించి తెలుసుకుందాం.
ప్రియాంక ఝా (Priyanka Jha)తో తొలిప్రేమ..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అతని మొదటి ప్రేమ ప్రియాంక ఝా గురించి తెలుసు. ఆమె కారు ప్రమాదంలో మరణించింది. ఆ ఘటన ఈ క్రికెటర్ హృదయాన్ని కలచివేసింది. ప్రియాంక ఝానే ధోని మొదటి ప్రియురాలిగా ఆ సినిమాలో చూపించారు.
దీపికా పదుకొనే (Deepika Padukone)..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేతో ధోని ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. 2007లో ఈ జంట మధ్య ఎఫైర్ నడిచినట్లు అప్పట్లో చాలా వార్తలు హల్చల్ చేశాయి. వీరి బంధంపై మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి.
రాయ్ లక్ష్మి (Raai Laxmi)..
ఎంఎస్.ధోని 2008-2009 మధ్యలో ప్రముఖ నటి రాయ్ లక్ష్మితో డేటింగ్ చేశాడు. ఐపీఎల్ మ్యాచుల తర్వాత జరిగిన పలు పార్టీలకు వారిద్దరూ కలిసి హాజరైనట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఏమైందో కానీ.. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఓ సందర్భంలో ధోనితో డేటింగ్ గురించి రాయ్ లక్ష్మి మాట్లాడుతూ అదొక మాయని మచ్చగా వర్ణించింది.
నిర్మాత ప్రీతీ సిమోస్ (Preeti Simoes)..
హిందీ టీవీ పరిశ్రమలో కామెడీ నైట్ విత్ కపిల్, ది కపిల్ శర్మ షో వంటి పాపులర్ టీవీ షోస్‌ని నిర్మించి గుర్తింపు పొందిన మహిళ నిర్మాత ప్రీతీ సిమోస్. ఈమెతో సైతం ధోని చెట్టపట్టాలు వేసుకొని తిరిగినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం పలు కారణాలతో వారు విడిపోయారు. అయినప్పటికీ గత 15 సంవత్సరాలుగా వారి మధ్య స్నేహబంధం మాత్రం అలాగే ఉంది.
అసిన్ (Asin)..
గజినీ సినిమాతో బాలీవుడ్‌లోనూ పాపులారిటీ సాధించిన సౌత్ ఇండియన్ నటి అసిన్. ఈ బ్యూటీతో సైతం ధోని ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఈ జంట కలిసి పని చేశారు. ఆ సమయంలో మొదలైన స్నేహం అనంతరం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే.. త్వరగానే జంట బ్రేకప్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. కాగా.. 2010లో ధోని, సాక్షిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి ప్రస్తుతం కూతురు జీవా ఉంది.