NataRatnalu: క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో కడుపుబ్బా నవ్వించే సినిమా

ABN , First Publish Date - 2022-05-14T22:52:13+05:30 IST

కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తుంటారో.. ఇప్పటికే పలు సినిమాల విషయంలో నిరూపితమైంది. విలక్షణ కథలపై ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో.. చిన్న బడ్జెట్‪తో రూపుదిద్దుకున్న సినిమాలు కూడా కోట్ల రూపాయలను సాధిస్తున్నాయి. ఇప్పుడలాంటి వినూత్న కథాంశంతోనే..

NataRatnalu: క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో కడుపుబ్బా నవ్వించే సినిమా

కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తుంటారో.. ఇప్పటికే పలు సినిమాల విషయంలో నిరూపితమైంది. విలక్షణ కథలపై ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో.. చిన్న బడ్జెట్‪తో రూపుదిద్దుకున్న సినిమాలు కూడా కోట్ల రూపాయలను సాధిస్తున్నాయి. ఇప్పుడలాంటి వినూత్న కథాంశంతోనే వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ‘నటరత్నాలు’ (NataRatnalu). ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Everest Entertainments) పతాకంపై.. నర్రా శివనాగు (Narra Sivanagu) కథ, స్క్రీన్‪ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణలో గాదే నాగభూషణం (Gade NagaBhushanam) రూపొందిస్తున్న చిత్రం ‘నటరత్నాలు’. ఎన్.ఎస్ నాగేశ్వరరావు (Nageswarao NS) నిర్మించనున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటోంది. అతిత్వరలో పూజా కార్యక్రమాలతో ఘనంగా చిత్రాన్ని ప్రారంభిస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. 


ఆనందాసు శ్రీ మణికంఠ (Anamdasu Sri Manikantha) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో.. పలు సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్‪గా నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ (Sudarsan), కమెడియన్-క్యారెక్టర్ ఆర్టిస్ట్‪గా దూసుకుపోతున్న రంగస్థలం మహేష్‪ (Rangasthalam Mahesh)లతో పాటు.. తెలుగు చిత్రసీమలో ఎంతోమంది హీరోలకు నటనలో శిక్షణ అందించిన సత్యానంద్ (Satyanand) ఇన్సిస్టిట్యూట్‪లో ట్రైనింగ్ తీసుకున్న యంగ్ హీరో అర్జున్ తేజ్ (ArjunTej) ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. డా భద్రం, తమిళ నటుడు శేషాద్రి,  తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో ‘నటరత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రంలో కామెడీ పార్ట్ హైలైట్ అయ్యేలా, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుంది. జూన్ మొదటివారంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, శరవేగంగా పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేసుకున్నాం. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ను కూడా ఎన్నుకున్నాం. ఖర్చుకు వెనకాడకుండా.. ఈ చిత్రాన్ని రూపొందించి, ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తాము..’’ అని తెలిపారు.

Updated Date - 2022-05-14T22:52:13+05:30 IST