Puneeth Rajkumar కుటుంబంలోనే ఎందుకిలా.. గతంలో కూడా వర్కవుట్స్ చేస్తూనే ఆ ఫ్యామిలీలో..

ABN , First Publish Date - 2021-10-30T22:34:42+05:30 IST

పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఇంకా ఆయన అభిమానుల్ని కోలుకోనివ్వటం లేదు. అలాగే, ఇతర సినిమా రంగాల్లోనూ కన్నడ పవర్ స్టార్ గుండెపోటు చర్చ తీవ్రంగా సాగుతోంది. అయితే, లెజెండ్రీ శాండల్‌వుడ్ స్టార్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు ఇలాంటి పరిణామం మరీ కొత్త కాదు...

Puneeth Rajkumar కుటుంబంలోనే ఎందుకిలా.. గతంలో కూడా వర్కవుట్స్ చేస్తూనే ఆ ఫ్యామిలీలో..

పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం ఇంకా ఆయన అభిమానుల్ని కోలుకోనివ్వటం లేదు. అలాగే, ఇతర సినిమా రంగాల్లోనూ కన్నడ పవర్ స్టార్ గుండెపోటు చర్చ తీవ్రంగా సాగుతోంది. అయితే, లెజెండ్రీ శాండల్‌వుడ్ స్టార్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు ఇలాంటి పరిణామం మరీ కొత్త కాదు. గతంలోనూ కన్నడ సినిమా ప్రియులు శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ విషయంలో షాక్ ఎదుర్కొన్నారు... 


పునీత్ రాజ్‌కుమార్ రెండో సోదరుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్. ఆయన కూడా సినిమా నటుడే. నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. అయితే, కొన్నేళ్ల క్రితం రాఘవేంద్రకు కూడా చిన్నపాటి గుండెపోటు వచ్చింది. మరీ ప్రమాదకరం కానప్పటికీ, హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. అత్యవసర వైద్య చికిత్సల తరువాత గండం నుంచీ బయటపడగలిగాడు. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏంటంటే... ఆయన కూడా అచ్చం పునీత్ లాగే అప్పట్లో జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ కుప్పకూలాడు! 


కన్నడ మహానటుడు రాజ్ కుమార్ ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు శివ రాజ్‌కుమార్. ఈయన కూడా జిమ్ చేస్తుండగా ఛాతిలో నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లాల్సి వచ్చింది. 2015లో శివ రాజ్‌కుమార్ ఈనాటి పునీత్ రాజ్‌కుమార్ లాంటి పరిస్థితినే అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. కానీ, పునీత్ కంటే పెద్దవారైన ఇద్దరికీ విధి మరో అవకాశం ఇచ్చింది. 46 ఏళ్ల పవర్ స్టార్‌కి మాత్రం ఛాన్స్ లభించలేదు. దాంతో ఆయన వ్యాయమం చేస్తుండగానే కుప్పకూలిపోయారు.  

Updated Date - 2021-10-30T22:34:42+05:30 IST