Nithin కి ఫ్లాప్స్ వచ్చినా అదే ఊపు...!

ABN , First Publish Date - 2022-08-30T17:00:25+05:30 IST

యూత్ స్టార్‌గా నితిన్‌ (Nithin)కి టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో ఈ యంగ్ హీరోకు సక్సెస్‌లు అందడం లేదు. అ..ఆ తర్వాత చేసిన సినిమాలు లై,

Nithin కి ఫ్లాప్స్ వచ్చినా అదే ఊపు...!

యూత్ స్టార్‌గా నితిన్‌ (Nithin)కి టాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో ఈ యంగ్ హీరోకు సక్సెస్‌లు అందడం లేదు. అ..ఆ తర్వాత చేసిన సినిమాలు లై, ఛల్ మోహన రంగ ఫ్లాపయ్యాయి. ఆ తర్వాత వెంకి కుడుమల దర్శకత్వంలో నటించిన భీష్మ సినిమాతో హిట్ అందుకున్నాడు. పోన్లే ఫాంలోకి వచ్చాడు అనుకుంటే మళ్ళీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. గత ఏడాది వచ్చిన చెక్, రంగ్ దే, మాస్ట్రో ఫ్లాపవగా..ఈ ఏడాది భారీ అంచనాలు పెట్టుకొని నటించిన మాచర్ల నియోజక వర్గం కూడా అదే లిస్ట్‌లో చేరింది.


అయినా నితిన్ ఊపు మాత్రం అసలు తగ్గడం లేదు. సినిమా తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తున్నాడు. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ యూత్ స్టార్ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ (Vakkantham vamshi)తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, తనకు భీష్మ మూవీతో హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుమల (Venky Kudumula)కి కూడా మరోసారి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 


ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒకే చెప్పాడట. దీనిపై ఇంకా అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానప్పటికి దాదాపు ఈ కాంబో ఫిక్సైందని చెప్పుకుంటున్నారు. ఈ రకంగా చూస్తే, వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా నితిన్ అవకాశాల కోసం ఎదుచూడటం లేదు. ఈ లెక్కన మంచి సాలీడ్ హిట్ పడితే, ఆ ఊపు ఇంకోలా ఉంటుందనడంలో సందేహమే లేదు.

Updated Date - 2022-08-30T17:00:25+05:30 IST