‘పుష్ప‌’లోని యాస వారికి తెలియదు.. కానీ!: ‘ఈటి’ హీరోయిన్

ABN , First Publish Date - 2022-03-09T02:43:22+05:30 IST

సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో.. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన చిత్రం ‘ఈటి’. సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మార్చి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో

‘పుష్ప‌’లోని యాస వారికి తెలియదు.. కానీ!: ‘ఈటి’ హీరోయిన్

సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో.. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన చిత్రం ‘ఈటి’. సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మార్చి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.


తెలుగులో చేసిన రెండు సినిమాలు అంతగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు మీ కెరీర్ ఎలా ఉంది?

త‌మిళంలో ముందు ‘డాక్ట‌ర్’ చేశా. అది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌. నా కెరీర్‌కు అది గుడ్ సైన్ ఇచ్చింది. ‘ఈటి’ సినిమా కూడా అంత‌కంటే గుర్తింపు ఇస్తుంది. మంచి సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే విషయం ‘డాక్ట‌ర్’ చిత్రంతో మరోసారి తెలిసింది. ఆ చిత్రం తెలుగులోనూ విడుద‌లై మంచి విజయం సాధించింది. అదేవిధంగా ‘పుష్ప‌’లో ఉన్న చిత్తూరు యాస‌ నార్త్‌లో తెలీదు. కానీ డ‌బ్బింగ్‌ ఆక‌ట్టుకునేలా చెప్ప‌డంతో అక్క‌డ నీరాజ‌నాలు ప‌లికారు. తెలుగులో ఆడ‌క‌పోయినా త‌మిళంలో నాకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈటి చిత్రంతో రెండు చోట్ల ఆ గుర్తింపు వస్తుంద‌ని న‌మ్ముతున్నాను.


హీరో సూర్య.. దర్శకుడు పాండిరాజ్ గురించి..?

ఆయనని చూసి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. త‌ను వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌. ప్ర‌తిరోజూ షాట్‌లో కొత్త విష‌యాలు చెప్పేవారు. ఆయ‌న‌కు స‌మాజ దృక్ప‌థం చాలా ఉంది. వెరీ జంటిల్‌మేన్‌. క‌ష్ట‌ప‌డేత‌త్వం ఆయ‌న‌ది. దానికితోడు అంకిత భావం వుంది. అలాగే న‌ట‌న ప‌రంగా ఓ సీన్ ఉంటే, దాని ముందుగా ఆయ‌న‌తో చ‌ర్చించి ఇలా చేయ‌వ‌చ్చ‌ని సూచ‌న చేసిన తర్వాతే న‌టించేదాన్ని. అప్పుడు న‌టిగా చాలా కంఫ‌ర్ట‌బుల్‌గా అనేపించేది. దర్శకుడు పాండిరాజ్ సార్ గురించి చెప్పాలంటే ఫ్యామిలీ సినిమాలు ఆయన బలం. ఒక్కో ద‌ర్శ‌కుడిలో ఒక్కో దృక్కోణం ఉంటుంది. అలాంటిది ఆయ‌న జోన‌ర్ నుంచి కాస్త బ‌య‌ట‌కు వ‌చ్చి చేసిన సినిమా ఇది. నేష‌నల్ అవార్డు ద‌ర్శ‌కుడు. ఆయన సినిమాలో న‌టించడం చాలా చాలా హ్యాపీ.


సూర్య నటించిన చివరి 2 సినిమాలు ఓటీటీలో అనూహ్య ఆద‌ర‌ణ పొందాయి. ఇప్పుడీ సినిమా థియేటర్లో వస్తుంది.. ఎలా అనిపిస్తుంది?

ఆయ‌న సినిమాలను నేను పోల్చ‌లేను. ప్ర‌తి ఒక్కరికి సూర్యగారి సినిమాల గురించి తెలుసు. ఆయన సినిమాలో నేను భాగ‌మైనందుకు గ‌ర్వంగా ఉందని మాత్రం చెప్పగలను.

ఇమ్మాన్ చ‌క్క‌టి బాణీలు స‌మ‌కూర్చారు. జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ బాగా చేశారు. ఇది క‌మ‌ర్షియ‌ల్ సినిమా అయినా సోష‌ల్ మెసేజ్ ఉంది. ఇందులో కోర్ పాయింట్ మహిళలపైనే ఉంటుంది. అది అంద‌రికీ రిలేటెడ్ అవుతుంది. ఇప్పుడు అది చెప్ప‌కూడ‌దు. సినిమా చూసిన మ‌హిళ‌లు త‌ప్ప‌కుండా క‌నెక్ట్ అవుతారని చెప్ప‌గ‌ల‌రు.


న‌టిగా మీకు స్పూర్తి ఎవ‌రు? 

శ్రీ‌దేవి, ర‌జ‌నీకాంత్‌, సౌంద‌ర్య‌


‘రాధేశ్యామ్’కి ముందే విడుదల.. ఎలా అనిపిస్తుంది?

చాలా థ్రిల్‌గా వుంది. రెండు భిన్న‌మైన క‌థ‌లు. ఏ భాష‌లో సినిమా బాగున్నా చూస్తారు. అలాగే ఆర్‌.ఆర్‌.ఆర్‌., మ‌ణిర‌త్నం సినిమాలు కూడా రాబోతున్నాయి.


ప్రస్తుతం ఏమేం చిత్రాలు చేస్తున్నారు..?

ప్రస్తుతం త‌మిళంలో ఓ సినిమా చేయ‌బోతున్నా.. వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.

Updated Date - 2022-03-09T02:43:22+05:30 IST