‘రొమాంటిక్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2021-10-23T22:53:24+05:30 IST

డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయ‌న సినిమాల‌ని ఆయ‌న ఫ్యాన్స్‌.. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చూస్తారు. డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి..

‘రొమాంటిక్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి: ఎర్రబెల్లి

ఆకాష్ పూరి, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్ర ప్రి రిలీజ్ వేడుకను శుక్రవారం వరంగల్ - హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమాల్లో రొమాన్స్‌కి ఎప్పటికీ త‌ర‌గ‌ని క్రేజ్ ఉంది. నాటి దేవ‌దాసు నుంచి నేటి రొమాంటిక్ వ‌ర‌కు అస్సలు మార్పు లేదు. అలాగే డాషింగ్ అండ్ డైన‌మిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఆయ‌న సినిమాల‌ని ఆయ‌న ఫ్యాన్స్‌.. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా చూస్తారు. డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన పూరి జగన్నాథ్‌, తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర దర్శకుల సినిమాల కంటే పూరి సినిమాలు విభిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో చూపించే హీరోయిజం వేరే లెవెల్‌లో ఉంటుంది. నిర్మాత‌గా కూడా పూరి, మంచి స‌క్సెస్ సాధించారు. తన కొడుకు ఆకాశ్‌ పూరిని ఎప్పుడో వెండితెరకు పరిచయం చేశారు పూరి. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆకాశ్‌ పలు సినిమాల్లో నటించాడు. ఆకాశ్ హీరోగా గ‌తంలో ‘మెహబూబా’ అనే సినిమా తీశారు. ఇప్పుడు ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కి పూరి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ చార్మీ కౌర్‌తో క‌లిసి నిర్మించారు. పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌కి, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా ద్వారా కేతికా శర్మ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని, హీరో హీరోయిన్లు, ఇత‌ర న‌టులు, సాంకేతిక నిపుణుల‌కు మంచి భ‌విష్యత్తు ఉండాల‌ని కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-10-23T22:53:24+05:30 IST