Enugu: ఆరోజున ‘ఏనుగు’ రావడం లేదు.. కారణమిదే!

ABN , First Publish Date - 2022-06-13T22:10:14+05:30 IST

శ్రీమతి జగన్మోహని సమర్పణలో.. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vigneswara Entertainments), డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ (Drumsticks Production House) పతాకంపై అరుణ్ విజయ్ (Arun Vijay), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), సముద్రఖని

Enugu: ఆరోజున ‘ఏనుగు’ రావడం లేదు.. కారణమిదే!

శ్రీమతి జగన్మోహని సమర్పణలో.. విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vigneswara Entertainments),  డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ (Drumsticks Production House) పతాకంపై అరుణ్ విజయ్ (Arun Vijay), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), సముద్రఖని (Samuthirakani), KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం ‘ఏనుగు’ (Enugu). ‘సింగం’ (Singham) సిరీస్ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరి (Hari) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను  సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా జూన్ 17న విడుదల చేయడం లేదని.. విడుదలకు సంబంధించిన మరో డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తాజాగా ప్రకటించారు. 


తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడినట్లుగా తెలుపుతూ.. మేకర్స్ అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. దీంతో ఈ చిత్రం చివరి నిమిషంలో ఆగిపోయింది. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటించనున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar ) సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటూ.. సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేస్తోంది. తమిళ్‌లో ఈ చిత్రం ‘యానై’ (Yaanai) అనే టైటిల్‌తో తెరకెక్కింది.



Updated Date - 2022-06-13T22:10:14+05:30 IST