Enugu: సెన్సార్‌ పూర్తి.. వచ్చేది అప్పుడే!

ABN , First Publish Date - 2022-06-26T02:48:26+05:30 IST

అరుణ్‌ విజయ్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఏనుగు’. సముద్రఖని, కేజీఎఫ్‌ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్‌, యోగిబాబు కీలక పాత్రధారులు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీత దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. జులై 1న ప్రేక్షకుల ముందుకురానుంది సినిమా.

Enugu: సెన్సార్‌ పూర్తి.. వచ్చేది అప్పుడే!

అరుణ్‌ విజయ్‌(Arun vijay), ప్రియా భవానీ శంకర్‌(Priya bhavani) జంటగా హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఏనుగు’. (Enugu) సముద్రఖని, కేజీఎఫ్‌ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్‌, యోగిబాబు కీలక పాత్రధారులు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీత దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. జులై 1న ప్రేక్షకుల ముందుకురానుంది సినిమా. 


నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలను ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాలని ఈ చిత్రం చేశాం. చక్కని సందేశం కూడా ఇచ్చే చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్‌ అవుతారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు. (Enugu on 1 july)


దర్శకుడు హరి మాట్లాడుతూ "దర్శకుడిగా నా 16వ చిత్రమిది. ఎమోషనల్‌ కంటెంట్‌తోపాటు ఫ్యామిలీ వాల్యూస్‌ ఇందులో చూపించాం. యాక్షన్‌, సెంటిమెంట్‌, ఎమోషన్‌, కామెడీ ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని అన్నారు. 


Updated Date - 2022-06-26T02:48:26+05:30 IST