Emilia Clarke: మెదడుకి రెండు సర్జరీలు జరిగినా.. మాటలు రావడం అదృష్టమంటున్న Game of Thrones బ్యూటీ

ABN , First Publish Date - 2022-07-20T17:05:24+05:30 IST

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతున్న పాపులర్ వెబ్‌సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ (Game of Thrones)’.

Emilia Clarke: మెదడుకి రెండు సర్జరీలు జరిగినా.. మాటలు రావడం అదృష్టమంటున్న Game of Thrones బ్యూటీ

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమై పాపులర్ అయిన వెబ్‌సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ (Game of Thrones)’. ఈ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఎమీలియా క్లార్క్ (Emilia Clarke). అనంతరం వచ్చిన స్టార్‌వార్స్ సినిమాలతో ఈ నటి క్రేజ్ బీభత్సంగా పెరిగింది. ఈ బ్రిటిష్ నటి తాజాగా నటించిన చిత్రం ‘ది సీగల్’. త్వరలో విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఎమీలియా తన మెదడుకి జరిగిన సర్జరీల గురించి తెలిపింది.


ఎమీలియాకి 2011లో అనేయూరిజం (aneurysm) అనే మెదడుకు సంబంధించిన వ్యాధి సోకింది. దీనివల్ల మెదడుకి సరిగా రక్తం సరాఫరా కాదు. దానివల్ల ఓ ప్రదేశంలో బ్లడ్ క్లాట్ అయ్యి పెలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కాగానే చికిత్స ఈ 35 ఏళ్ల నటి వెంటనే తీసుకుంది. కానీ.. 2013లో మరోసారి ఆ వ్యాధికి గురైంది. దీనివల్ల కొన్ని అత్యవసర చికిత్సలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ సర్జరీల ప్రక్రియ వల్ల అఫాసియా ప్రభావానికి గురైంది. దీనివల్ల ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. సరిగ్గా మాట్లాడడం కూడా కష్టమే.


ఈ సర్జరీల గురించి ఎమిలీయా మాట్లాడుతూ.. ‘ఇకపై నేను నా మెదడుని పూర్తిగా ఉపయోగించలేను. కానీ.. స్పష్టంగా మాట్లాడగలగడం నా అదృష్టం. పూర్తిగా ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా నా జీవితాన్ని సాధారణంగా జీవించగలను. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఆ కొద్ది మందిలో నేను ఉడడం సంతోషంగా అనిపిస్తుంది. మీ మెదడులోని ఏ భాగానికైన రక్తం అందకపోతే అది పనికిరాకుండా పోతుంది. ప్రవహించే దారిలో ఏదైనా అడ్డువస్తే రక్తం వెంటనే వేరే దారి చూసుకుంటుంది. దానివల్ల రక్తం అందని భాగం పనిచేయదు’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-07-20T17:05:24+05:30 IST