హాలీవుడ్ బ్యూటీ కోసం... Elon Musk 5 లక్షల డాలర్ల విరాళం!

ABN , First Publish Date - 2022-05-01T03:35:55+05:30 IST

వ్యాపారవేత్తగా, ప్రపంచపు అత్యంత సంపన్నుడిగా ఎలెన్ మస్క్ మనందరికీ తెలుసు. కానీ, ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ అంతగా పాప్యులర్ కాలేదు. బిలియనీర్ మస్క్ మాజీ ప్రియురాళ్లలో హాలీవుడ్ స్టార్ యాంబర్ హెర్డ్ కూడా ఒకరు. ఆమెతో దాదాపు సంవత్సరం పాటూ...

హాలీవుడ్ బ్యూటీ కోసం... Elon Musk 5 లక్షల డాలర్ల విరాళం!

వ్యాపారవేత్తగా, ప్రపంచపు అత్యంత సంపన్నుడిగా ఎలెన్ మస్క్ మనందరికీ తెలుసు. కానీ, ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ అంతగా పాప్యులర్ కాలేదు. బిలియనీర్ మస్క్ మాజీ ప్రియురాళ్లలో హాలీవుడ్ స్టార్ యాంబర్ హెర్డ్ కూడా ఒకరు. ఆమెతో దాదాపు సంవత్సరం పాటూ ‘టెస్లా’ బాస్ సరసాలు సాగించాడు. అది పెద్ద రహస్యమేం కాదు. వారిద్దరూ అందరికీ తెలిసేలానే డేటింగ్ చేశారు. కాకపోతే, అప్పట్లోనే హాలీవుడ్ బ్యూటీ హెర్డ్ తన భర్త జానీ డెప్ కు విడాకులు ఇచ్చింది. వెంటనే మస్క్ కి దగ్గరైంది. 


కోర్టు గుమ్మం తొక్కి విడాకులు తీసుకున్న యాంబర్ హెర్డ్, జానీ డెప్ జంట అంతటితో ఆగలేదు. 7 మిలియన్ డాలర్ల భారీ భరణంతో భార్యకు దూరమైన డెప్ ఆమె మరోసారి తనని పబ్లిగ్గా విలన్ ని చేసేందుకు ప్రయత్నించటంతో పరువు నష్టం దావా వేశాడు. యాంబర్ ఓ పత్రికలో మాజీ భర్త డెప్ గురించి వ్యాసం రాసింది. అతను గృహ హింసకు పాల్పడ్డాడని, తనను కొట్టటమే కాకుండా లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. దాంతో జానీ డెప్ కు భారీ నష్టమే వాటిల్లింది. పత్రికలో యాంబర్ హెర్డ్ అలా ఇష్టానుసారం రాయటంతో అతడి పరువు పోవటమే కాకుండా అనేక భారీ హాలీవుడ్ ఆపర్లు కూడా చేజారాయి. ఈ పరిణామాలతో ఆగ్రహానికిలోనైన డెప్ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఆ కేసు తాలూకూ విచారణ ప్రస్తుతం జరుగుతోంది... 


డెప్, హెర్డ్ మధ్య కొనసాగుతోన్న కోర్టు వ్యవహారంలో రోజుకొక ట్విస్ట్ బయటపడుతోంది. తాజాగా ఎలెన్ మస్క్ పేరు కూడా విచారణలో వినిపించింది. యాంబర్ మాజీ ప్రియుడైన మస్క్ ఆమె తరుఫున ‘అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్’(ఏసీఎల్ యూ)కి 5 లక్షల డాలర్ల భారీ విరాళం ఇచ్చినట్టు తేలింది. అందుక్కారణం, విడాకుల సమయంలో... జానీ డెప్ నుంచీ తనకు భరణంగా లభించిన 7 మిలియన్ డాలర్లలో కొంత భాగం యాంబర్ హెర్డ్ ‘ఏసీఎల్ యూ’కి అందజేస్తానని పబ్లిక్ గా ప్రకటించటమే! హాలీవుడ్ స్టార్ హీరోయిన్ డైవోర్స్ టైంలో భరణం డబ్బుల్ని విరాళంగా ఇస్తానని చెప్పింది కానీ... ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేకపోయింది. ఆమెకు ఆర్దికమైన ఒత్తిళ్లు ఉండటంతో బాయ్ ఫ్రెండ్ మస్క్ 5 లక్షల డాలర్లు సివిల్ లిబర్టీస్ వారికి తాను విరాళంగా అందజేశాడట! 


జానీ డెప్ తో యాంబర్ హెర్డ్ వివాహ బంధాన్ని తెంచుకున్నాక కేవలం సంవత్సరం పాటూ మస్క్ ఆమెతో డేటింగ్ చేశాడు. ఆ కాలంలోనే లక్షల డాలర్ల విరాళం రహస్యంగా పంచి పెట్టాడు. కానీ, కలిసినంత త్వరగానే మస్క్, హెర్డ్ విడిపోయారు. తాజాగా మరోసారి కోర్టు విచారణలో భాగంగా వారిద్దరి పేర్లూ జంటగా వినిపించాయి...  

Updated Date - 2022-05-01T03:35:55+05:30 IST