ఇద్దరు మిత్రుల కథ

ABN , First Publish Date - 2022-10-08T05:30:00+05:30 IST

శ్రీకాంత్‌ పరకాల, శివ హీరోలుగా దీక్షిత్‌ కోడెపాక దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఈ3 విత్‌ లవ్‌’.

ఇద్దరు మిత్రుల కథ

శ్రీకాంత్‌ పరకాల, శివ హీరోలుగా దీక్షిత్‌ కోడెపాక దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఈ3 విత్‌ లవ్‌’. వాయుపుత్ర క్రియేషన్స్‌ బేనర్‌లో తెరకెక్కుతోంది. ఇటీవలె చిత్రీకరణ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు దర్శకుడు శేఖర్‌ కమ్ముల క్లాప్‌ ఇచ్చారు. ఎస్‌.వి ఎన్‌ రావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రం ఇది అని దీక్షిత్‌ కోడెపాక తెలిపారు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కథ ఇది అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అల్లాడి ప్రణవ్‌ చంద్ర

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST