Black Adam: భారత్‌లో ఒకరోజు ముందుగా రానున్న ‘బ్లాక్‌ ఆడమ్‌’.. విడుదల ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2022-10-14T15:26:57+05:30 IST

హాలీవుడ్‌ (Hollywood) స్టార్‌, ది రాక్ డ్వైన్‌ జాన్సన్‌ నటించిన చిత్రం ‘బ్లాక్‌ ఆడమ్‌’ (Black Adam). ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది డీసీ (DC) మూవీ లవర్స్ అమితాసక్తితో..

Black Adam: భారత్‌లో ఒకరోజు ముందుగా రానున్న ‘బ్లాక్‌ ఆడమ్‌’.. విడుదల ఎప్పుడంటే..

హాలీవుడ్‌ (Hollywood) స్టార్‌, ది రాక్ డ్వైన్‌ జాన్సన్‌ నటించిన చిత్రం ‘బ్లాక్‌ ఆడమ్‌’ (Black Adam). ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది డీసీ (DC) మూవీ లవర్స్ అమితాసక్తితో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా విడుదలకానుంది. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్‌ చేయనున్నారు. నిజానికి భారత్‌ మినహా ఇతర దేశాల్లో ఒక రోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. ‘జంగిల్‌ క్రూస్’ ఫేం జుమీ కొల్లెట్‌ సెర్రా దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్టుకు ఆడమ్‌ స్టికెల్‌, రోరో హైన్స్‌, షోరబ్‌ నోషిర్వాని కథ సమకూర్చారు. అల్డిస్‌ హోడ్జ్‌, నోహ్‌ సెంటినియో, క్రింటెస్సా స్విన్‌డెల్‌, పిర్సీ బ్రెస్నాన్‌ కీలక పాత్రలు పోషించారు. యాక్షన్‌ అడ్వెంచర్‌, ఫాంటసీ మూవీగా భారీ బడ్జెట్‌తో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.



Updated Date - 2022-10-14T15:26:57+05:30 IST